వీడియో : హీరోయిన్ యొక్క 100 ఏళ్ల ఇంటిని చూద్దాం రండీ!
బాలీవుడ్ ముద్దుగుమ్మ డయానా పెంటీ ఈ ఏడాది ఛావా, ఆజాద్, డిటెక్టివ్ షెర్డిల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది.
By: Ramesh Palla | 29 Oct 2025 11:30 AM ISTబాలీవుడ్ ముద్దుగుమ్మ డయానా పెంటీ ఈ ఏడాది ఛావా, ఆజాద్, డిటెక్టివ్ షెర్డిల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. హీరోయిన్‌గా డయానా పెంటీ మరిన్ని సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచే డయానా పెంటీ ఈ సారి తన అందమైన పురాతనమైన ఇంటి వల్ల వార్తల్లో నిలిచింది. డయానా పెంటీ ఇంటిని ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ సందర్శించారు. తన ఇంటి నుంచి ఫరా ఖాన్ దాదాపుగా రెండు గంటల ప్రయాణం తర్వాత డయానా పెంటీ ఇంటిని చేరుకున్నారు. ఫరా ఖాన్ తనతో పాటు తన ఇంటి వంటవాడు అయిన దిలీప్‌ను సైతం తీసుకు వెళ్లింది. డయానా ఇంటికి వెళ్లిన విషయాలను ఫరా ఖాన్ యూట్యూబ్ ద్వారా వీడియో రూపంలో షేర్ చేసింది.
ఫరా ఖాన్ యూట్యూబ్ వీడియో..
డయానా పెంటీ యొక్క ముత్తాతకు చెందిన ఆ అత్యంత పురాతన ఇంటిని చూసి ఫరా ఖాన్, ఆమె వంట వాడు దిలీప్ ఆశ్చర్యపోయారు. వందల ఏళ్లుగా ఆ ఇంటిని అలాగే కాపాడుకుంటూ వస్తున్నట్లు డయానా పెంటీ తల్లి వీడియోలో చెప్పుకొచ్చింది. ఫరా ఖాన్ తన యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోను ఫోస్ట్ చేయగా మిలియన్‌ల కొద్ది వ్యూస్ నమోదు అవుతున్నాయి. డయానా యొక్క ప్రాచీన ఇంటిని చూసేందుకు చాలా మంది ఆ వీడియోను ఓపెన్ చేస్తున్నారు. ఆ వీడియోలో డయానా యొక్క ప్రాచీనమైన ఇంటిని చూపించడం మాత్రమే కాకుండా ఫరా ఖాన్ తన రెగ్యులర్ ఎంటర్‌టైన్మెంట్‌ను ఆ వీడియోలో చూపించడం జరిగింది. దాంతో వీడియోను అత్యధికులు మొదటి నుంచి చివరి వరకు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫరా ఖాన్ యొక్క వంటవాడు దిలీప్ తోనూ కామెడీ పండిస్తూ సరదాగా వీడియో సాగింది.
డయానా పెంటీ 100 ఏళ్ల ఇల్లు
ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఇంత పెద్ద ఇల్లు నీదేనా అంటూ డయానాను ఫరా ఖాన్ ప్రశ్నించింది. డయానా నవ్వుతూ నా ఇల్లు పైన ఉంది, కింద అమ్మ ఉంటుంది. నేను అమ్మ ఇంట్లో ఎక్కువ ఉంటాను. ఎందుకంటే అమ్మ ఇంట్లోనే కిచెన్ ఉంటుంది అని సరదాగా చెప్పుకొచ్చింది. డయానా తల్లిని కూడా ఈ వీడియోలో చూపించింది. బ్రిటీష్ వారి కాలంలో నిర్మించిన ఈ ఇల్లును అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. డయానా పూర్వీకులు బ్రిటీష్ నుంచి ఎన్నో వస్తువులు తీసుకు వచ్చి ఇల్లు నిర్మాణం చేపట్టారు. అందుకే ఈ ఇల్లు ఇంత అందంగా ఉందని, వంద ఏళ్లు దాటినా ఇంకా కొత్తగా, ఆకర్షణీయంగా ఉందని అంటున్నారు. వంట గదితో పాటు ప్రతి ఒక్క రూం కూడా వింటేజ్ సొగసును అల్లుకుంది. గత నాలుగు తరాలుగా ఈ ఇంట్లోనూ తమ కుటుంబం ఉంటున్నట్లు డయానా పేర్కొంది.
సోషల్ మీడియాలో డయానా ఇల్లు వైరల్
ఇంట్లోని చెక్క టేబుల్లు, పలు వస్తువులు వంద ఏళ్ళు, అంతకు మించిన వయసు కలిగినవి అంటూ డయానా చెప్పడంతో ఫరా ఖాన్ ఆశ్చర్యపోయింది. వయసులో నా కంటే పెద్ద వాటిని నేను చూస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. మొత్తానికి సరదాగా ఈ వీడియోను ఫరా ఖాన్ మల్చడంతో పాటు, డయానా యొక్క వంద ఏళ్ల ఇంటిని చూపించడం ద్వారా తన ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. ఫిల్మ్ మేకర్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న ఫరా ఖాన్ ఇలా యూట్యూబ్ ద్వారా గత కొంత కాలంగా ప్రేక్షకులకు చేరువ అవుతోంది. ఇలాంటి వీడియోలు గతంలోనూ చాలా షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకునే విధంగా ఈమె వీడియోలు ఉండటం వల్లే ఏకంగా 2.5 మిలియన్‌ల సబ్‌స్క్రైబర్స్‌ను ఫరా ఖాన్ దక్కించుకుంది. డయానా పెంటీ వందల ఏళ్ల ఇంటిని మీరు చూడాలంటే ఫరా ఖాన్ యూట్యూబ్ ఛానల్ లోని ఈ వీడియోను పూర్తిగా చూడండి.
