Begin typing your search above and press return to search.

కార్ ప్ర‌మాదంలో స్టార్ హీరో సేఫేనా?

ప్రమాద స్థలం నుండి కొన్ని విజువ‌ల్స్ ఇప్ప‌టికే ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలలో శివకార్తికేయన్ నల్లటి టీ షర్ట్ ధరించి కారు బయట నిలబడి సురక్షితంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   20 Dec 2025 11:11 PM IST
కార్ ప్ర‌మాదంలో స్టార్ హీరో సేఫేనా?
X

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ఆదివారం చెన్నైలోని మధ్య కైలాష్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అత‌డు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. న‌గ‌ర మార్గంలో ఎదురుగా వ‌స్తున్న కార్ గుద్దేయ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అదృష్ట‌వ‌శాత్తూ అత‌డికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాద స్థలం నుండి కొన్ని విజువ‌ల్స్ ఇప్ప‌టికే ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలలో శివకార్తికేయన్ నల్లటి టీ షర్ట్ ధరించి కారు బయట నిలబడి సురక్షితంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. నిజానికి ప్ర‌మాద స‌మ‌యంలో ఆ కార్‌లో శివ‌కార్తికేయ‌న్ స‌హా అత‌డి కుటుంబ స‌భ్యులు కార్ లో ఉన్నారు. ప్ర‌మాదానికి సంబంధించిన‌ స‌మాచారం తెలుసుకున్న వెంట‌నే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అక్క‌డికి వ‌చ్చి ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కార్ ప్ర‌మాద‌ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

త‌మ ఫేవ‌రెట్ హీరో కార్ ప్ర‌మాదానికి గురైంద‌న్న వార్త‌లు విన్న త‌ర్వాత అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే రోడ్ పై ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉండ‌టంతో ప్ర‌మాద తీవ్ర‌త త‌గ్గింద‌ని కూడా తెలుస్తోంది. అయితే ఈ కార్ ప్ర‌మాదానికి సంబంధించిన స‌రైన స‌మాచారం లేక‌పోవ‌డంతో కొంత గంద‌ర‌గోళం నెల‌కొంది.

రెమో, డాక్టర్‌, డాన్‌, అమరన్, ప్రిన్స్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు శివ‌కార్తికేయ‌న్. గతేడాది అమరన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అశోకచక్ర బిరుదు గ్రహీత మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత క‌థ‌లో అత‌డి డ్యాషింగ్ పెర్ఫామెన్స్ కి ప్ర‌శంస‌లు కురిసాయి. దేశ‌భ‌క్తి, త్యాగం వంటి అంశాల‌ను ఈ చిత్రంలో అందంగా చూపించారు. ఈ చిత్రంలో ఆర్మీ అధికారి ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్‌ పాత్రలో శివకార్తికేయన్ అద్భుతంగా నటించాడు. సాయి పల్లవి ఆర్మీ ఆఫీసర్ భార్యగా నటించింది.