స్టార్ హీరోయిన్ పై భారీ ట్రోల్స్.. కారణం?
మాధురి దీక్షిత్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.
By: Madhu Reddy | 4 Nov 2025 9:00 PM ISTబాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ ఒకప్పుడు ఎంతోమంది కుర్ర కారుకి డ్రీమ్ గర్ల్ గా ఉండేది. అలాంటి మాధురి దీక్షిత్ తాజాగా ఓ షోలో పాల్గొని విమర్శలు ఎదుర్కొంది. దీంతో సోషల్ మీడియాలో మాధురి దీక్షిత్ పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి దానికి కారణమేంటి..? మాధురి దీక్షిత్ చేసిన తప్పేంటి..?అనేది ఇప్పుడు చూద్దాం.
మాధురి దీక్షిత్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.అయితే కెనడాలో జరిగే ఒక కార్యక్రమానికి మాధురి దీక్షిత్ వెళ్లాల్సి ఉంది. కానీ కెనడాలో జరిగిన ఈవెంట్ కి మాధూరి దీక్షిత్ దాదాపు 3 గంటలు ఆలస్యంగా వెళ్ళింది. దాంతో సోషల్ మీడియాలో మాధురి దీక్షిత్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే షో ఫార్మాట్ ను స్పష్టం చేయడంలో కూడా నిర్వాహకులు విఫలమయ్యారని చాలామంది అభిమానులు గందరగోళానికి గురవ్వడంతో పాటు అసంతృప్తికి లోనయ్యారు.
అంతేకాదు కొంతమంది అయితే పెట్టిన టికెట్ డబ్బులు తిరిగి చెల్లించండని గోలగోల చేశారు. దాంతో చాలామంది మాధురి దీక్షిత్ అక్కడికి ఆలస్యంగా రావడంపై అలాగే తన పేలవమైన ప్రదర్శనపై విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ నేను మీకు ఒక సలహా ఇవ్వగలిగితే.. మాధురి దీక్షిత్ షో కి హాజరు కాకపోవడమే చాలా మంచిది. మీ డబ్బును ఆదా చేసుకోండి అని పోస్ట్ పెట్టగా.. మరో వ్యక్తి ఈవెంట్ పెద్ద గందరగోళం.. టైం వేస్ట్ అంటూ చెప్పారు. ఇక ఈ షోకి హాజరై నిరాశ చెందిన వ్యక్తి ఈ విధంగా పోస్ట్ పెట్టాడు. ఇప్పటివరకు నేను చూసిన షోలలో ఇది పెద్ద చెత్త షో. ఈ షో చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఆమె ప్రతి పాటలో రెండు సెకండ్లు చాట్ చేసి డాన్స్ చేయబోతుందని ముందు చెప్పలేదు. ప్రమోటర్లు చాలా పేలవంగా షో నిర్వహించారు. ఈ షో నుండి చాలామంది వాకౌట్ చేశారు. ఈ షోకి వచ్చిన చాలామంది డబ్బులు తిరిగి చెల్లించమని గోల గోల చేశారు.
మాధురి దీక్షిత్ ఎంత అందమైన హీరోయిన్ అయినా పర్వాలేదు కానీ.. ఈ షోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆ షో చాలా పేలవంగా ఉందని అంగీకరించాల్సిందే.ఈ షో నిర్వాహకులు ప్రేక్షకుల సమయం గురించి కొంచెం కూడా ఆలోచించలేదు. మాధురి దీక్షిత్ 3 గంటలు ఆలస్యంగా వస్తే ఎలా అంటూ పోస్ట్ పెట్టాడు.
అయితే ఈ ఈవెంట్ కి సంబంధించిన టికెట్లలో షో 7:30 గంటలకే ప్రారంభమవుతుందని ఉందట. కానీ మాధురి దీక్షిత్ 3గంటలు లేటుగా రావడం వల్ల షో లేటుగా స్టార్ట్ అయింది. దాంతో చాలామంది ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. ప్రేక్షకుల సమయాన్ని వృధా చేయడంతో పాటు అక్కడికి వచ్చిన వారందరినీ అగౌరవపరిచారు అంటూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేస్తున్నారు.
అయితే మరికొంతమంది మాత్రం మాధురి దీక్షిత్ ని సమర్థిస్తున్నారు. అందులో ఓ వ్యక్తి.. ఇందులో మాధురి దీక్షిత్ తప్పులేదు. ఇది ప్రొడక్షన్ లేదా మేనేజ్మెంట్ సమన్వయ సమస్య కావచ్చు అని పోస్ట్ పెట్టాడు. మరో వ్యక్తి మాధురి దీక్షిత్ వీరాభిమానులు ఆమెని దగ్గరి నుండి చూసినా చాలు అని ఆనందిస్తారు. ఆమె చేసింది తప్పేమీ కాదు అది మేనేజ్మెంట్ లోపం అని పోస్ట్ పెట్టారు..
అయితే ఈ ఏడాది మొదట్లో సింగర్ నేహా కక్కర్ తన మెల్ బోర్న్ కచేరీకి లేటుగా రావడం వల్ల చాలా విమర్శలు ఎదుర్కొంది.ఇక ఈ ఇలాంటి విమర్శలే తాజాగా మాధురి దీక్షిత్ కూడా ఎదుర్కొంటుంది.అయితే సింగర్ నేహా కక్కర్ లేటుగా వచ్చినందుకు అక్కడికి వచ్చిన వారందరికీ క్షమాపణలు చెప్పింది. మరి మాధురి దీక్షిత్ కూడా సింగర్ నేహా కక్కర్ లాగే సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై స్పందించి క్షమాపణలు చెబుతుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటివరకైతే మాధురి దీక్షిత్ నుండి గానీ ఆమె టీం నుండి గాని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
