అనిల్ హార్డ్ వర్క్‌కు మెగా ఫ్యాన్స్ ఫిదా
రెండేళ్ల కిందట సంక్రాంతి కానుకగా రిలీజైన వాల్తేరు వీరయ్య కు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో పాటూ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
By: Sravani Lakshmi Srungarapu | 14 Jan 2026 4:00 AM ISTఏ ఫ్యాన్ కు అయినా తమ ఫేవరెట్ హీరోను ఫలానా తీరులో చూసుకోవాలని కోరిక ఉండటం సహజం. ఈ నేపథ్యంలోనే తమ హీరోను బాగా ప్రెజెంట్ చేసే డైరెక్టర్లతో సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కూడా అలానే కోరుకున్నారు. కానీ చిరూ రీఎంట్రీ తర్వాత వచ్చిన సినిమాలు వేటిలోనూ వింటేజ్ చిరూ కనిపించలేదు.
వాల్తేరు వీరయ్యతో వింటేజ్ చిరూని చూపించిన బాబీ
మెగాస్టార్ రీఎంట్రీ తర్వాత పలు సినిమాలు రాగా వాటిలో కొద్దో గొప్పో వింటేజ్ చిరూ స్క్రీన్ పై కనిపించేలా చేసిన డైరెక్టర్ బాబీ. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరూ కు కామెడీ సీన్స్ రాసి, ఆయన కామెడీ టైమింగ్ ను బాబీ బాగా వాడుకున్నారనే సంగతి తెలిసిందే. రెండేళ్ల కిందట సంక్రాంతి కానుకగా రిలీజైన వాల్తేరు వీరయ్య కు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో పాటూ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
బాబీని మించిన అనిల్
అయితే ఇప్పుడు బాబీని మించి పోయేలా అనిల్ చిరూని ప్రెజెంట్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా రీసెంట్ గా సంక్రాంతి కానుకగా రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాలో అందరినీ విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తుంది చిరంజీవి కామెడీ టైమింగ్.
వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని బాబీ బాగా ప్రెజెంట్ చేశారనుకుంటున్న వారికి బాబీ కంటే మెరుగ్గా చిరూని ఈ సినిమాలో ప్రెజెంట్ చేశారు అనిల్. లుక్స్ నుంచి డ్యాన్సులు, కామెడీ టైమింగ్ వరకు ప్రతీ విషయంలోనూ అనిల్ చేసిన స్టడీ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లోని చిరూ కామెడీ టైమింగ్ ను సరిగ్గా పట్టుకున్న అనిల్, ఆ విషయంలో బాగా సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో చిరూని ఇంత బాగా ప్రెజెంట్ చేసినందుకు అనిల్ కు మెగా ఫ్యాన్స్ నుంచి విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి.
