తారక్ టాలెంట్ కు సందీప్ కరెక్ట్ డైరెక్టరా?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తన టాలెంట్ తో వేరే లెవెల్ లో ఫేమ్ సంపాదించుకున్నారు.
By: M Prashanth | 7 Sept 2025 4:00 AM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తన టాలెంట్ తో వేరే లెవెల్ లో ఫేమ్ సంపాదించుకున్నారు. ఓ రేంజ్ లో వరల్డ్ వైడ్ గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. వరుస హిట్స్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. అదే సమయంలో నాన్ స్టాప్ గా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
అయితే వరుస హిట్స్ అందుకుంటున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తమకు తెలియని లోటు ఇప్పుడు ఉండిపోతుందని చెబుతున్నారు. ముఖ్యంగా తమ అభిమాన హీరోల సినిమాల్లో డెప్త్ మిస్ అవుతోందని అంటున్నారు. అన్నీ కమర్షియల్ హిట్సేనని.. తారక్ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సరైన చిత్రాలు కావని కామెంట్లు పెడుతున్నారు.
ఒక విధంగా అది నిజమనే చెప్పాలి.. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సహా తారక్ నటించిన రీసెంట్ సినిమాలు కమర్షియల్ జోనర్ లోనే ఉన్నాయి. ఆయన పూర్తి నటనా సామర్థ్యాన్ని అన్వేషించడానికి కావాల్సినంత స్కోప్ అయితే లేదు. అందుకే ప్రేక్షకులకు, ఆడియన్స్ కు తారక్ మూవీస్ లో డెప్త్ మిస్ అయినట్లు అనిపిస్తుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కు ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్ అవసరమని చెబుతున్నారు. వాస్తవానికి.. సందీప్ ఫిల్మ్ మేకింగ్ స్టైలే వేరు. సాధారణ వాణిజ్య సినిమాలకు మించిన అద్భుతమైన, చిరస్మరణీయమైన సన్నివేశాలు అందిస్తారు. తన స్పెషల్ డైరెక్షన్ టాలెంట్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటారు.
సవాల్ విసిరేలా సినిమాలు తీస్తారని అందరూ అంటుంటారు. ఆయన ఇప్పటికే విజయ్ దేవరకొండ, రణబీర్ కపూర్ లతో దాన్ని నిరూపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో వర్క్ చేస్తే.. అద్భుతమని ఫ్యాన్స్ చెబుతున్నారు. కచ్చితంగా అసాధారణమైన కాంబినేషన్ అవుతుందని, నెవ్వర్ బిఫోర్ అనేలా అవుట్ పుట్ ఉంటుందని ఆశిస్తున్నారు.
అయితే వంగా అద్భుతమైన క్లోజప్ షాట్ ల్లో దిట్ట. కాబట్టి ఇప్పుడు ఆయన శైలి.. తారక్ కు పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ ఎక్స్ ప్రెషన్స్ కింగ్ అన్న విషయం తెలిసిందే. కాబట్టి తారక్ టాలెంట్ గా సందీప్ రెడ్డి వంగా అవసరమని చెబుతున్నారు. ఆయనలో ఉన్న ప్రతిభ అంతా బయటకు వస్తుందని, వేరే లెవెల్ అవుట్ పుట్ కూడా అందుతుందని అంటున్నారు. మరి ఫ్యూచర్ లో సందీప్-తారక్ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.
