Begin typing your search above and press return to search.

ప్రముఖ హీరోయిన్ త్రిష కి బాంబ్ బెదిరింపులు.. అసలు నిజం ఇదే!

తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ తో పాటు గవర్నర్ భవన్, బీజేపీ కార్యాలయాలకు అలాగే ప్రముఖ సినీ నటి త్రిష నివాసానికి కూడా గుర్తు తెలియని వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది.

By:  Madhu Reddy   |   3 Oct 2025 10:44 AM IST
ప్రముఖ హీరోయిన్ త్రిష కి బాంబ్ బెదిరింపులు.. అసలు నిజం ఇదే!
X

తమిళనాడులో మరొకసారి బాంబు బెదిరింపుల భయాందోళనలు అటు ప్రజలను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ తో పాటు గవర్నర్ భవన్, బీజేపీ కార్యాలయాలకు అలాగే ప్రముఖ సినీ నటి త్రిష నివాసానికి కూడా గుర్తు తెలియని వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది.

తనిఖీలు నిర్వహించిన అధికారులు..

వీరందరికీ బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన బాంబు డిస్పోసల్ బృందాలు.. స్నిఫర్ డాగ్స్ సహాయంతో సంఘటనా స్థలాలకు చేరుకొని విస్తృతంగా తనిఖీలు జరిపారు అధికారులు..అయితే ఎక్కడా కూడా పేలుడు పదార్థాలు కనబడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇక్కడ జరిగింది కేవలం తప్పుడు బెదిరింపులేనని.. ఎక్కడ బాంబు ఉన్నట్టు ఆధారాలు లేవని స్క్వాడ్ వర్గాలు స్పష్టం చేశాయి.

ముఖ్యమంత్రి నివాసం ముందు హై అలెర్ట్..

ప్రస్తుతం అల్వార్ పేటలోని ముఖ్యమంత్రి నివాసం, రాజ్ భవన్ చుట్టూ భద్రత వలయాలు పెంచి హై అలర్ట్ ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఈ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి నుంచి వచ్చాయి? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రముఖ సినీ నటి త్రిషా ఇంటికి కూడా బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

గతంలో కూడా బాంబు బెదిరింపులు..

ఇదిలా ఉండగా గతంలో కూడా తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్, హీరో, టీవీకే అధినేత విజయ్ దళపతి ఇంటికి కూడా గతంలో బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఇదే తరహాలో బెదిరింపులు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ ఫేక్ ఘటనలతో అటు తమిళనాడులో కూడా ఈ విషయం పెద్ద సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు.

ఫేక్ బెదిరింపు కాల్స్ తో ప్రజలలో భయాందోళనలు..

ఏది ఏమైనా ఇలాంటి కాల్స్ ప్రజలలో భద్రత వ్యవస్థల పైన నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని విశ్లేషకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు ఇలాంటి కాల్స్ భవిష్యత్తులో నిజమైన ప్రమాదాలను నిర్లక్ష్యం చేసే అవకాశం కూడా లేకపోలేదు అంటూ హెచ్చరిస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా దుండగులు మొదట ఇలాంటి ఫేక్ కాల్స్ చేసి భవిష్యత్తులో నిజంగానే దారుణానికి ఒడిగడితే పరిస్థితి ఏంటి? ప్రజల ప్రాణాలకు ఎవరు హామీ? అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు..

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి?

అధికారులు వెంటనే అప్రమత్తమై సదరు కాల్స్ చేసిన వ్యక్తులను అరెస్టు చేసి కఠిన శిక్ష విధిస్తే.. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ముఖ్యమంత్రి ఇంటి వద్ద జడ్ ప్లస్ భద్రతా ఉన్నప్పటికీ వరుసగా రెండోసారి ఇలాంటి కాల్స్ రావడంతో ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివి చేస్తున్నారు అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలని కోరుతున్నారు. అంతేకాదు త్రిష అభిమానులు కూడా ఈమె ఇంటికి బెదిరింపు కాల్స్ రావడం ఏంటి ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.