Begin typing your search above and press return to search.

హాలీవుడ్ ఛాన్స్ ఇచ్చినా? నాకొద్దు పో!

హాలీవుడ్ లో అవ‌కాశం అంటే చిన్న విష‌య‌మా? ఎంతో ట్యాలెంట్, ఫేమ్ ఉంటే త‌ప్ప సాధ్యం కాదు.

By:  Srikanth Kontham   |   19 Aug 2025 12:26 PM IST
హాలీవుడ్ ఛాన్స్ ఇచ్చినా? నాకొద్దు పో!
X

హాలీవుడ్ లో అవ‌కాశం అంటే చిన్న విష‌య‌మా? ఎంతో ట్యాలెంట్, ఫేమ్ ఉంటే త‌ప్ప సాధ్యం కాదు. ఛాన్స్ వ‌చ్చిందంటే ఉన్న అవ‌కాశాలు వ‌దులుకుని మ‌రీ అమెరికా ప్లైట్ ఎక్కిపోతారు. హాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వాత వ‌చ్చే గుర్తింపు...ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే హాలీవుడ్ ఛాన్స్ అంటే ఎవ‌రూ మిస్ చేసుకోరు. ఎంత చిన్న అవ‌కాశమైనా? ఛాన్స్ దొరికితే దూరిపోదామ‌ని చూస్తారు. భార‌త్ నుంచి అలా హాలీవుడ్ కి వెళ్లి స‌క్సెస్ అయిన వాళ్లు ఎవ‌రు? అంటే ప్రియాంక చోప్రా పేరు బ‌లంగా వినిపిస్తుంది.

అంతే సీరియ‌స్ గా రిజెక్ష‌న్:

పీసీ కంటే ముందే మ‌రికొంత మంది వెళ్లినా? పీసీ రేంజ్ లో ఎవ‌రూ స‌క్సస్ అవ్వ‌లేదు. పీసీ కూడా చిన్న అవకాశాల‌తోనే గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. అలాంటి హాలీవుడ్ అవ‌కాశాన్నే వ‌దిలేసాడు మాలీవుడ్ సంచ‌ల‌నం ఫ‌హాద్ పాజిల్. 'ది రివ‌నెంట్', 'బ‌ర్డ్ మ్యాన్' లాంటి చిత్రాల‌తో సంచ‌ల‌నంగా మారిన హాలీవుడ్ ద‌ర్శ‌కుడు లెజాండ్రో గోంజాలెజ్ ఇనారిటుతో తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం ద‌క్కింది. నేరుగా అత‌డే ప‌హాద్ కి ట‌చ్ లో కి వ‌చ్చి అవ‌కాశం క‌ల్పించారు. కానీ ఆ ఛాన్స్ ను అంతే సీరియ‌స్ గా రిజెక్ట్ చేసాడు ప‌హాద్.

బోర్డర్ దాటేది లేదు:

ఎందుకలా అంటే? ఇంగ్లీష్ లో ప‌హాద్ చెప్పాల్సిన డైలాగుల్లో యాస్ మిస్ అవుతుందిట‌. ఆ భాష‌పై ప‌ట్టు రావాలంటే నాలుగు నెల‌లు అమెరికాలో ఉండి భాష‌పై ట్రైనింగ్ తీసుకోవాల‌న్నారుట‌. కానీ ఆ స‌మ‌యంలో ఎలాంటి జీతం ఉండ‌ద‌ని ...ఉచితంగానే నేర్చుకోవాల‌నే కండీష‌న్ పెట్టాడుట డైరెక్ట‌ర్. దీంతో ప‌హాద్ ఫీలైన‌ట్లు క‌నిపిస్తుంది. నీ ఇంగ్లీష్ సినిమా అవ‌కాశం త‌న‌కొద్ద‌ని రిజెక్ట్ చేసాడు. త‌న జీవితంలో అన్ని మల‌యాళంలోనే జ‌రిగాయని... ఆ బోర్డ‌ర్ దాటి వెళ్లేది లేద‌ని చెప్పాడుట‌.

తెలుగింట ఫేమ‌స్ అలా:

కేవ‌లం యాస‌ను మార్చ‌డం కోసం అంత‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని..భార‌తీయ చిత్ర ప‌రిశ్ర మ‌లోనే ఎన్నో అవ‌కాశాలు త‌న‌కు వ‌స్తున్నాయ‌ని..అలాంటి క‌న్న త‌ల్లిని వ‌దిలేసి..విదేశీ చిత్రాల్లో న‌టిం చాల్సిన ఉత్సాహం త‌న‌కెంత మాత్రం లేద‌న్నారు. పుష్ప సినిమాతో ప‌హాద్ పాజిల్ తెలుగింట ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియాలోనూ ఈ సినిమా ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చి పెట్టింది.