అమ్మ బాబోయ్.. ఈ స్టార్ హీరో భార్యకు ఇంత బంగారం ఉందా?
బంగారం అంటే అమ్మాయిలు ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా మహిళలు డబ్బులు వస్తే చాలు బంగారం చేసి పెట్టుకుంటూ ఉంటారు.
By: Sivaji Kontham | 2 Oct 2026 9:57 PM ISTబంగారం అంటే అమ్మాయిలు ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా మహిళలు డబ్బులు వస్తే చాలు బంగారం చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఇక అలాంటిది హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక స్టార్ హీరో భార్య అలానే ఒక ప్రముఖ హీరోయిన్ బంగారం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
అసలు విషయానికి వస్తే..మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారారు. ఫహాద్ ఫాజిల్ తొలిసారి నేరుగా తెలుగు సినిమాలో నటించిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మించారు. సినిమా విడుదలైన నేపథ్యంలో ఫహాద్‌కు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఇంటర్వ్యూలో ఫహాద్ తన సూపర్ హిట్ మలయాళ సినిమా ఆవేశం లోని రంగా పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో రంగా పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని డిఫరెంట్ లుక్, డ్రెస్, హెయిర్ స్టైల్, యాటిట్యూడ్, యాక్షన్ సీన్స్, మాట్లాడే విధానం ప్రేక్షకులకు బాగా నచ్చాయి.
అయితే రంగా పాత్రలో ఫహాద్ ధరించిన భారీ బంగారు ఆభరణాలు కూడా అప్పట్లో ప్రత్యేకంగా చర్చకు వచ్చాయి. తాజాగా ఆ గోల్డ్ జువెలరీ గురించి ఫహాద్ చెప్పిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
రంగా పాత్ర కోసం తాను వేసుకున్న బంగారం మొత్తం తన భార్య, నటి నజ్రియా నజీమ్‌దేనని ఫహాద్ చెప్పారు. ఆయన ఈ విషయాన్ని సరదాగా, లైట్‌గా చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆ లుక్ నజ్రియాకు కూడా చాలా నచ్చిందని ఫహాద్ పేర్కొన్నారు.
ఫహాద్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. “నజ్రియాకు నిజంగానే ఇంత బంగారం ఉందా?” అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు తమాషాగా ఈ ఇంటర్వ్యూ తర్వాత మన హీరో ఇంట్లో రైడ్ జరగచ్చేమో అని కూడా కామెంట్స్ పెడుతున్నారు.
ఫహాద్, నజ్రియా ఇద్దరూ సౌత్ ఇండియాలో పాపులర్ సెలబ్రిటీ కపుల్. సినిమాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఇద్దరూ కలిసి పనిచేస్తుంటారు. ఆవేశం సినిమాతో నజ్రియా నిర్మాతగా కూడా భాగమయ్యారు.
ఇప్పుడు ఫహాద్ తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయనకు సంబంధించిన పాత విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇక ఫహాద్ కొత్త సినిమా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ పరవాలేదు అనిపించుకుంటుంది.
