పుష్ప విలన్ నుంచి పిల్లల హీరోగా..
ఈ సినిమాలో ఫహాద్ చిన్నారి సారాతో కలిసి కనిపిస్తున్నారు. ట్రైలర్‌లోనే ఇద్దరి మధ్య బాండింగ్, మ్యాజిక్, ఫ్యామిలీ ఎమోషన్‌ను ఎక్కువగా చూపించారు.
By: M Prashanth | 1 Oct 2026 9:13 AM ISTతెలుగు ఆడియన్స్‌కు ఫహాద్ ఫాజిల్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ‘పుష్ప’లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రే. అల్లు అర్జున్‌కు ఎదురుగా నిలిచిన ఆ క్యారెక్టర్‌తో ఇక్కడ ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఫహాద్ పేరు ఎక్కువగా సీరియస్, డార్క్, ఇంటెన్స్ పాత్రలతోనే వినిపించింది. ఇప్పుడు మాత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’తో పూర్తిగా మరో యాంగిల్ లో కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో ఫహాద్ చిన్నారి సారాతో కలిసి కనిపిస్తున్నారు. ట్రైలర్‌లోనే ఇద్దరి మధ్య బాండింగ్, మ్యాజిక్, ఫ్యామిలీ ఎమోషన్‌ను ఎక్కువగా చూపించారు. ఇప్పటివరకు తెలుగులో విలన్‌గా క్రేజ్ అందుకున్న నటుడు ఇప్పుడు పిల్లలతో కలిసి చూడగల ఫ్యామిలీ సినిమాలో మెయిన్ లీడ్‌గా రావడం ఆసక్తికరంగా మారింది. ఫహాద్‌కు కూడా ఇది తెలుగు మార్కెట్‌లో కొత్త ఛాలెంజ్ అనే చెప్పాలి.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. సినిమా మీద వచ్చిన మొదటి రివ్యూలు కూడా ఇదే టోన్‌ను హైలైట్ చేస్తున్నాయి. మహేశ్ బాబు ఫహాద్ సారా కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడితే, ఎన్టీఆర్ అయితే ప్రతి చిన్నారి, ప్రతి పేరెంట్ కలిసి చూడాల్సిన సినిమా అంటూ చెప్పేశారు. దీంతో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ను ఫాంటసీ మూవీ కంటే ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న సినిమాగా హైలెట్ చేయడం స్టార్ట్ అయ్యింది.
ఫహాద్‌కు ఇది ఇమేజ్ ఛేంజ్ మాత్రమే కాదు. ‘పుష్ప’తో వచ్చిన గుర్తింపును హీరోగా ఎంతవరకు ఉపయోగించుకోగలడన్నది కూడా ఇక్కడే తేలుతుంది. విలన్‌గా వచ్చినప్పుడు అల్లు అర్జున్ స్టార్ పవర్, పెద్ద ఫ్రాంచైజీ సపోర్ట్ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం తన పేరుతోనే తెలుగు ఆడియన్స్‌ను థియేటర్లకు తీసుకురావాలి. ముఖ్యంగా పిల్లలు, ఫ్యామిలీస్‌ను టార్గెట్ చేసే సినిమా కావడంతో మౌత్ టాక్ చాలా కీలకం.
అక్టోబర్ 2 హాలిడే కూడా ఈ సినిమాకు మంచి అడ్వాంటేజ్. అదే రోజు మరికొన్ని సినిమాలు ఉన్నా, ఫ్యామిలీ సెగ్మెంట్‌ను నేరుగా టార్గెట్ చేస్తున్న సినిమా ఇదే అన్న ఫీలింగ్ ప్రమోషన్స్‌లో కనిపిస్తోంది. ఫహాద్ లాంటి నటుడు ఇలాంటి జోనర్‌లో కనిపించడం కూడా సినిమాకు డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తోంది. మొదటి రోజు కంటే వీకెండ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారన్నదే ముఖ్యం. ‘పుష్ప’లో పోలీస్ యూనిఫాం వేసుకుని భయపెట్టిన ఫహాద్.. ఇప్పుడు చిన్నారి పక్కన నిలబడి నవ్వించే, ఎమోషన్ చూపించే పాత్రలో వస్తున్నారు. తెలుగు ఆడియన్స్ ఆయనను ఈ కొత్త ఇమేజ్‌లో ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారన్నది చూడాలి.
