Begin typing your search above and press return to search.

మళ్లీ రంగ చెట్టా వైబ్స్ తెచ్చిన ఫహాద్.. ట్రెండింగ్‌లో 'కేకు వాకు'!

వచ్చే నెల సెప్టెంబర్ 11న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. టైమ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్, ఫస్ట్ సింగిల్ గా 'కేకు వాకు' అనే వీడియో సాంగ్ ను బయటకు వదిలారు.

By:  M Prashanth   |   13 Aug 2026 11:13 PM IST
మళ్లీ రంగ చెట్టా వైబ్స్ తెచ్చిన ఫహాద్.. ట్రెండింగ్‌లో కేకు వాకు!
X

ఫహాద్ ఫాజిల్ స్క్రీన్ మీద కనిపిస్తే ఆ ఎనర్జీనే వేరు. ఆవేశం సినిమాలో రంగ చెట్టాగా పిచ్చెక్కించిన ఈ వెర్సటైల్ యాక్టర్, ఇప్పుడు మరో క్రేజీ క్యారెక్టర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఆర్కా మీడియా వర్క్స్, ప్రేమలు సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. రాజమౌళి కాంపౌండ్ నుంచి వస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పై బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాలు ఉన్నాయి.

వచ్చే నెల సెప్టెంబర్ 11న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. టైమ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్, ఫస్ట్ సింగిల్ గా 'కేకు వాకు' అనే వీడియో సాంగ్ ను బయటకు వదిలారు. ఇందులో ఫహాద్ ఫాజిల్ సూరి అనే పాత్రలో కనిపిస్తున్నాడు. క్యారెక్టర్ కు ఉన్న పిచ్చితనం, ఎంతటి రిస్క్ నైనా చాలా ఈజీగా ఒక కేక్ వాక్ లా చేసే డేర్ డెవిల్ నేచర్ ను ఎలివేట్ చేస్తూ ఈ పాటను డిజైన్ చేశారు. టీజర్ తోనే అటెన్షన్ క్రియేట్ చేసిన ఈ టీమ్ కి ఈ సాంగ్ తో మరింత హైప్ వచ్చింది.

ఈ మ్యూజిక్ వీడియోలో ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ స్వయంగా స్క్రీన్ మీద కనిపించడం. కూల్ గా స్టార్ట్ అయిన పాటలో కాల భైరవ థంపింగ్ బీట్స్ తో ఎంట్రీ ఇవ్వగానే విజువల్స్ ఫుల్ వాకీ మోడ్ లోకి వెళ్లిపోతాయి. కేవలం క్యాచీ ట్యూన్ ఇవ్వడమే కాకుండా, ఎనర్జిటిక్ స్టెప్స్ తో కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ బాగా ఇంప్రెస్ చేశాడు. ఎంసీ హరితో కలిసి ఈ సాంగ్ కు అద్భుతమైన లిరిక్స్ అందించడంతో పాటు, ఇద్దరూ కలిసి పాడిన విధానం ట్రాక్ కు ఫుల్ ఎనర్జీ తీసుకొచ్చింది.

ఇక వీడియోలో ఫహాద్ ఫాజిల్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే మళ్లీ ఆవేశం సినిమాలోని గ్రేస్ ఫుల్ మూవ్స్ గ్యారెంటీగా గుర్తుకు వస్తాయి. ఫేస్ లో ఆకట్టుకునే నవ్వు, స్టైలిష్ చార్మ్ తో పాటు సూరి క్యారెక్టర్ లోని మాడ్ నెస్ అంతా ఈ మూడు నిమిషాల పాటలో క్లియర్ గా కనిపిస్తుంది. ఫహాద్ కు తోడుగా హీరోయిన్ స్సారా కూడా ఈ ఫన్ వీడియోలో జాయిన్ అవ్వడం సాంగ్ కు మరింత స్పెషల్ అప్పీల్ తీసుకొచ్చింది. ఫ్యాన్స్ కి ఇదొక కంప్లీట్ ఐ ఫీస్ట్ లా ఫీల్ అయ్యేలా సెట్స్, లైటింగ్ అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ చేశారు.

ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ద్వారా శశాంక్ యేలేటి డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. మొదటి సినిమానే ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఎంచుకుని, ఫహాద్ లాంటి పెర్ఫార్మర్ తో వర్క్ చేయడం అంటే చిన్న విషయం కాదు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ లాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ తోడవడంతో కంటెంట్ రిచ్ గా మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాటిక్ వాల్యూస్ చూస్తుంటే థియేటర్లలో ఏదో గట్టి మ్యాజిక్ జరగబోతోందనిపిస్తుంది. సౌరభ్ సచ్ దేవ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిలీజ్ కి ఇంకా ఒక నెల మాత్రమే సమయం ఉండటంతో, రాబోయే రోజుల్లో మిగతా ఆల్బమ్ ని కూడా వరసగా రిలీజ్ చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోంది.