Begin typing your search above and press return to search.

ఐకానిక్ డైలాగ్ మళ్లీ హిట్.. బాలయ్య వాయిస్ ఓవర్‌ వర్కౌట్ అయిందిగా!

మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ పాన్ ఇండియా స్థాయిలో తన విలక్షణ నటనతో ప్రత్యేకాభిమానులను సంపాదించుకున్నడు.

By:  Madhu Reddy   |   21 Sept 2026 1:05 PM IST
ఐకానిక్ డైలాగ్ మళ్లీ హిట్.. బాలయ్య వాయిస్ ఓవర్‌ వర్కౌట్ అయిందిగా!
X

మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ పాన్ ఇండియా స్థాయిలో తన విలక్షణ నటనతో ప్రత్యేకాభిమానులను సంపాదించుకున్నడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ఫాంటసీ ఎంటర్‌టైనర్ చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ కోసం మేకర్స్ బాలయ్య వాయిస్ ఓవర్‌ను ఉపయోగిస్తుండటంతో ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనంగా మారింది.

బాలయ్య డైలాగ్‌తో మొదలైన మ్యాజిక్:

నందమూరి బాలకృష్ణ నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రంలోని "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్" అనే పవర్ ఫుల్ డైలాగ్ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఆ పాపులర్ మాస్ డైలాగ్‌నే టైటిల్‌గా మార్చి ఫాహద్ ఫాసిల్ హీరోగా ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీని తెరకెక్కించారు. టైటిల్ వినగానే బాలయ్య గుర్తొచ్చే ఈ చిత్రానికి, ఇప్పుడు ఆయన వాయిస్ ఓవర్ కూడా తోడవడంతో సినిమా స్థాయి మరింత పెరిగిపోయింది.

‘సూరి’గా ఫాహద్ ఫాజిల్ మేనియా :

ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ 'సూరి' అనే విభిన్నమైన స్ట్రీట్ మ్యాజీషియన్ పాత్రలో అలరించనున్నారు. ఫాంటసీ, కామెడీ, అడ్వెంచర్ అంశాల కలయికగా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది. ఇక షూటింగ్ సహా అన్ని పనులూ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రాజమౌళి సమర్పణలో భారీ నిర్మణం:

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. మూవీ ట్రైలర్‌ను సెప్టెంబర్ 22న లాంచ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.

బాలయ్య అభిమానులకు పండగే :

నందమూరి బాలకృష్ణ స్వయంగా ఈ సినిమా ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈ ప్రాజెక్ట్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్. "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్" అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉండండి అంటూ చిత్ర యూనిట్ ఇచ్చిన క్యాప్షన్ అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఇక ట్రైలర్‌లో బాలయ్య వాయిస్ ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇక తెలుగు నాట విపరీతమైన క్రేజ్ ఉన్న బాలకృష్ణ వాయిస్ ఓవర్ జతకావడంతో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీకి ఊహించని మైలేజ్ లభించింది. సెప్టెంబర్ 22న రాబోతున్న ట్రైలర్ యూట్యూబ్‌లో ఏ రికార్డులను తిరగరాస్తుందో, అలాగే అక్టోబర్ 2న థియేటర్లలో ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి. ఇక బాలయ్య వాయిస్ తో రాబోయే ఈ ట్రైలర్ కోసం మూవీ లవర్స్ రెడీగా ఉన్నారు.