షెకావత్ జీ ఎందుకిలా? ఏం జరుగుతోంది?
షెకావత్ జీ.. అదేనండీ.. పుష్ప, పుష్ప-2 సినిమాల్లో భన్వర్ లాల్ షెకావత్ గా కనిపించిన మాలీవుడ్ నటుడు ఫహాద్ ఫాజిల్.
By: M Prashanth | 1 Sept 2025 12:25 AM ISTషెకావత్ జీ.. అదేనండీ.. పుష్ప, పుష్ప-2 సినిమాల్లో భన్వర్ లాల్ షెకావత్ గా కనిపించిన మాలీవుడ్ నటుడు ఫహాద్ ఫాజిల్. సోలో హీరోగా కాకుండా.. విలన్ తో పాటు కీలక పాత్రల్లో వివిధ సినిమాల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. స్పెషల్ ఫ్యాన్ క్రియేట్ చేసుకున్నారు.
కానీ కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోలేకపోతున్నారు. ప్రతి మూవీలోని తన యాక్టింగ్ తో సినీ ప్రియులను, అభిమానులను మెప్పిస్తున్నారు. అయినా కథల ఎంపికలో తడబడడం వల్ల సినిమాలతో విజయం సాధించలేకపోతున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
ఆవేశం మూవీ తప్ప గత ఐదు సంవత్సరాలలో ఫహద్ ప్రధాన పాత్ర పోషించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించలేకపోయింది. ఇరుల్, జోజి, మాలిక్, మలయకుంజు, ధూమన్, మారిసన్ వంటి అనేక చిత్రాల్లో లీడ్ రోల్ పోషించారు. కానీ అనుకున్నంత స్థాయిలో మాత్రం రెస్పాన్స్ అందుకోలేకపోయారు.
రీసెంట్ గా ఫహాద్ నటించిన ఓడుం కుతిర చాదుం కుతిర థియేటర్స్ లో విడుదలైంది. కానీ ఆ సినిమా కూడా ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లో స్పందన అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ ఫహాద్ ను నిరాశపరిచింది. కావాల్సినంత టాలెంట్ ఉన్నా.. కూడా మాలీవుడ్ స్టార్ యాక్టర్ ను కొంతకాలంగా విజయం అందని ద్రాక్షలా మారింది.
ఈ ఏడాదిలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఫహాద్. మారిసన్ థియేటర్స్ లో నిరాశపరచగా.. కొన్ని రోజుల క్రితం ఓటీటీలోకి వచ్చి ఆకట్టుకుంది. ఫహాద్ ఫాజిల్ , వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన ఆ మూవీ.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ఆడియోతో అలరిస్తోంది.
అయితే మరో విషయమేమిటంటే ఫహాద్ ఫాజిల్.. విక్రమ్, మామన్నన్, పుష్ప, పుష్ప 2 వంటి చిత్రాలతో సహాయ నటుడిగా మంచి విజయాలు సాధిస్తున్నారు. సహాయక పాత్రలకు సరైన స్క్రిప్ట్ లను ఎంచుకున్నట్లు కనిపిస్తున్నారు. కానీ ప్రధాన పాత్రలకు పేలవమైన స్క్రిప్ట్ లను ఎందుకు ఎంచుకుంటున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికైనా సరైన స్క్రిప్ట్ లను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
