పరభాషా హీరోతో బడా నిర్మాణ సంస్థ బ్యాక్ టూ బ్యాక్!
మాలీవుడ్ లో పహాద్ ఫాజిల్ ఎంత పెద్ద నటుడు అన్నది చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
By: Srikanth Kontham | 31 Oct 2025 9:00 PM ISTమాలీవుడ్ లో పహాద్ ఫాజిల్ ఎంత పెద్ద నటుడు అన్నది చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించడం పహాద్ ప్రత్యేకత. పాజిటివ్ రోల్ అయినా? నెగిటివ్ రోల్ అయినా? తనదైన మార్క్ ఉంటుంది. `పుష్ప` తో తెలుగులోనూ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. బన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రెండు భాగాల్లోనూ పహాద్ పాత్ర ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈసినిమా అనంతరం షెకావత్ అన్నది పహాద్ కి మారుపేరులా మారిపోయింది.
పాన్ ఇండియాలో ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో ఇతర భాషల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. మునుపటి కంటే కోలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు ఫహాద్. తెలుగులో కూడా చాలా అవకాశాలు వచ్చాయి. కానీ పాత్రల పరంగా పహాద్ చాలా సెలక్టివ్ గా ఉంటాడు. కథ, పాత్ర నచ్చితే తప్ప కమిట్ అవ్వడు. ప్రస్తుతం తెలుగు `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` అనే చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే `బాహుబలి` చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ కూడా ఫహాద్ తో ఓ సినిమా నిర్మిస్తోంది.
ఇటీవలే ఈ సినిమా పట్టాలెక్కింది. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. అయితే ఆ సినిమాకు సంబంధించిన వివరాలేవి బయటకు రాలేదు. ఆర్కా మీడియా బ్యానర్ అంటే సినిమా పూర్తయ్యే వరకూ వివరాలు వెల్లడించదు. ఈ సినిమా విషయంలో కూడా బాహుబలి తరహా గోప్యత వహిస్తోంది. అలాగే ఈ సినిమా అనంతరం పహద్ మెయిన్ లీడ్ లో మరో సినిమా కూడా నిర్మిస్తున్నట్లు శోభు యార్లగడ్డ ప్రకటించారు. ఈ సినిమా దర్శకుడు ఎవరు? అన్నది కూడా రివీల్ చేయలేదు. ఇలా ఆర్కా మీడియా వర్క్స్ పరభాషా హీరోతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయడం ఆసక్తికరం.
తెలుగు లో చాలా మంది నటులున్నా? వాళ్లెవ్వరికీ ఇవ్వని అవకాశాలు ఆర్కా సంస్థ ఇతర భాషా హీరోకు కల్పించడం మరో విశేషం. ఈ సంస్థనే కాదు మైత్రీ మూవీ మేకర్స్ సహా మరికొన్ని సంస్థలు కూడా స్థానిక హీరోల్ని పక్కన బెట్టి ఇతర భాషల నటుల్ని ప్రోత్సహించడంపై ఫిలిం సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.
ఇతర పరిశ్రమలు తెలుగు నటులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయి? అన్నది కూడా చర్చకు వస్తోంది.
