Begin typing your search above and press return to search.

ఆరు వారాలైనా థియేటర్‌లో అదే జోరు

ఇలాంటి సమయంలో ఒక సినిమా ఆరు వారాలు థియేటర్‌లలో కొనసాగుతుంది అంటే ఏ స్థాయి విజయాన్ని ఆ సినిమా సాధించిందో అర్థం చేసుకోవచ్చు.

By:  Ramesh Palla   |   8 Aug 2025 4:00 PM IST
ఆరు వారాలైనా థియేటర్‌లో అదే జోరు
X

శాటిలైట్ శకం ఆరంభం అయిన తర్వాత సినిమాలు వంద రోజులు ఆడటం కష్టంగా మారింది, ఓటీటీ శకం ఆరంభం అయిన తర్వాత సినిమాలు థియేటర్‌లో కనీసం రెండు వారాలు ఉండే పరిస్థితి లేదు. నాలుగు వారాల్లోనే సినిమాలు ఓటీటీలో వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు కేవలం థియేట్రికల్‌ రిలీజ్ అయిన మూడు వారాల్లోనే ఓటీటీలో వచ్చేస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు మాదిరిగా సినిమాలు వచ్చే పరిస్థితి లేదు. ఒక్క సినిమా ఎన్ని వందల కోట్లు వసూళ్లు రాబట్టింది అనే లెక్కలు వేస్తున్నారు తప్ప, ఎన్ని వారాలు, ఎన్ని రోజులు సినిమా ఆడింది అనే లెక్కలు కనిపించడం లేదు. అప్పట్లో సినిమా 50 రోజులు, 100 రోజులు ఆడిన దాన్ని బట్టి హిట్‌, ఫ్లాప్‌ ను నిర్ణయించే వారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

రూ.100 కోట్ల బాక్సాఫీస్ రికార్డ్‌

ఒక సినిమా రెండు మూడు వారాలు థియేటర్‌లో ఉండి, మంచి వసూళ్లు సాధిస్తే సూపర్‌ హిట్‌గా చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఒక సినిమా ఆరు వారాలు థియేటర్‌లలో కొనసాగుతుంది అంటే ఏ స్థాయి విజయాన్ని ఆ సినిమా సాధించిందో అర్థం చేసుకోవచ్చు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ గత ఆరు వారాలుగా బుక్‌ మై షో లో టాప్‌ లో ట్రెండ్‌ అవుతున్న మూవీ ఎఫ్‌ 1. ఈ సినిమా హాలీవుడ్‌ స్టార్‌ బ్రాడ్‌ పిట్‌ దర్శకత్వంలో రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. జూన్‌ నెలలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతూ ఉంది. ఆరు వారాల్లో ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది.

ఎఫ్‌ 1 సినిమాకు ఇండియాలో బ్రహ్మరథం

బుక్‌ మై షో ఇండియా లో 42 రోజుల పాటు ట్రెండింగ్‌ స్ట్రీక్‌ గా కొనసాగిన హాలీవుడ్‌ సినిమాగా ఎఫ్‌ 1 నిలిచింది. ఫార్ములా రేస్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన దక్కింది. ఇండియాలో ఈ సినిమాను జనాలు ఎంత వరకు చూస్తారు అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకే విడుదల సమయంలో పెద్దగా బజ్ క్రియేట్‌ కాలేదు. పైగా ప్రమోషన్స్‌ సైతం పెద్దగా చేయలేదు. దాంతో ఓపెనింగ్స్ కాస్త స్లోగా నమోదు అయ్యాయి. మెల్ల మెల్లగా సినిమాకు మంచి స్పందన రావడంతో వసూళ్లు పుంజుకున్నాయి. హాలీవుడ్‌ సినిమాలు ఒకప్పుడు రాబట్టిన స్థాయిలో ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేక పోతున్నాయి అనుకుంటున్న సమయంలో ఈ సినిమా సంచలనాత్మకంగా వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్‌ ను షేక్‌ చేస్తోంది.

ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు..!

ఈ సినిమాను ఓటీటీ ద్వారా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ చేసే విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించడం లేదు. దాంతో సినిమా గురించి ప్రచారం భారీగా జరిగిన నేపథ్యంలో ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీ తేదీ ఈ మధ్య కాలంలో లేకపోవడంతో థియేటర్‌ కి వెళ్లి చూడాలని చాలా మంది భావిస్తున్నారు. ఆరు వారాల తర్వాత కూడా ఈ సినిమాకు సాలిడ్‌ బాక్సాఫీస్ కలెక్షన్స్ నమోదు కావడం మనం చూడవచ్చు. ఈ మధ్య కాలంలో హాలీవుడ్‌ సినిమాలే కాకుండా ఇండియన్‌ సినిమాల్లో ఏ ఒక్క సినిమా ఇంత సుదీర్ఘమైన బాక్సాఫీస్ రన్‌ కలిగి లేదు. రికార్డ్‌ స్థాయిలో వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా ఖచ్చితంగా ముందు ముందు మరిన్ని రికార్డ్‌లను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.