అరుదైన ఘనతను సాధించిన హాలీవుడ్ మూవీ
ఇలాంటి పరిస్థితుల్లో ఓ సినిమా 100 రోజుల థియేట్రికల్ రన్ ను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే F1 మూవీ. బ్రాడ్ పిట్ నటించిన ఈ హాలీవుడ్ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.
By: Sravani Lakshmi Srungarapu | 4 Oct 2025 12:00 AM ISTటెక్నాలజీ బాగా పెరిగిన నేపథ్యంలో ఓటీటీలు కూడా చాలా ఎక్కువైన సంగతి తెలిసిందే. ఓటీటీల డిమాండ్ పెరగడంతో ప్రతీ సినిమా థియేట్రికల్ రిలీజ్ జరిగిన కొన్నాళ్లకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కొన్ని సినిమాలు ముందే ఓటీటీ సంస్థలతో డీల్ కుదుర్చుకుంటే, మరికొన్ని సినిమాలు రిలీజయ్యాక వచ్చే టాక్ ను బట్టి ఆ డీల్ ను సవరించుకుంటూ ఉంటాయి.
ఓటీటీల పుణ్యమా అని తగ్గిపోయిన థియేట్రికల్ రన్
సినిమాలు, వాటి థియేట్రికల్ రన్ ఓటీటీలు వచ్చాక పూర్తిగా మారిపోయాయి. ఒకప్పటిలా సినిమాలకు థియేటర్లలో లాంగ్ రన్ ఉండటం లేదు. అప్పట్లో సినిమా హిట్ అయితే ఆ మూవీ నెలలు, సంవత్సరాల పాటూ థియేటర్లలో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఎంత హిట్ టాక్ వచ్చినా మూడు, నాలుగు వారాలకు మించి ఎక్కువ ఆడటం లేదు.
F1@ 100డేస్
ఇలాంటి పరిస్థితుల్లో ఓ సినిమా 100 రోజుల థియేట్రికల్ రన్ ను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే F1 మూవీ. బ్రాడ్ పిట్ నటించిన ఈ హాలీవుడ్ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీని థియేటర్లలో చూసిన ఆడియన్స్ కు F1మంచి ఎక్స్‌పీరియెన్స్ ను అందించింది. బాక్సాఫీస్ వద్ద సినిమా ఓ వారం రోజుల పాటూ ఆడటమే కష్టమైన ఈ రోజుల్లో F1 మూవీ ఏకంగా 100 రోజులు ఆడటం ఆ సినిమా యొక్క సామర్థ్యతను తెలియచేస్తుంది.
ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ఆడుతున్న F1మూవీ
F1 మూవీ ఇండియాలో చాలా మంచి థియేట్రికల్ రన్ ను అందుకుంది. ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటూ హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లలో F1 మూవీ రన్ అవుతుంది. జోసెఫ్ కోసిన్క్సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రాడ్ పిట్ ఫార్ములా వన్ రేసింగ్ డ్రైవర్ గా ఎంతో అద్భుతమైన నటనను కనబరచగా, ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చాక కూడా థియేటర్లలో రన్ అవడం విశేషం.
