Begin typing your search above and press return to search.

టూ మ‌చ్ వ‌యోలెన్స్:వెండితెర‌పై ర‌క్త‌పాతం!

వెండితెర‌పై మునుపెన్న‌డూ లేనంత‌గా ర‌క్త‌పాతం జ‌రుగుతోంది. ఏ స్టార్ హీరో సినిమాని చూసినా అందులో మోతాదుకు మించి వ‌యోలెన్స్ ఉండాల్సిందే.

By:  Tupaki Entertainment Desk   |   20 Feb 2026 8:00 AM IST
టూ మ‌చ్ వ‌యోలెన్స్:వెండితెర‌పై ర‌క్త‌పాతం!
X

వెండితెర‌పై మునుపెన్న‌డూ లేనంత‌గా ర‌క్త‌పాతం జ‌రుగుతోంది. ఏ స్టార్ హీరో సినిమాని చూసినా అందులో మోతాదుకు మించి వ‌యోలెన్స్ ఉండాల్సిందే. ప్ర‌త్య‌ర్థిపై ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో ర‌గిలిపోయే హీరోలు క‌త్తులు దూస్తూ వెండితెర‌పై బ్ల‌డ్ బాత్ చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. మునుప‌టికి మించి క‌థ‌ల్లో హింసాత్మ‌క స‌న్నివేశాలు, వాటి తీవ్ర‌త పెరిగిపోవ‌డంతో..ప్రేక్ష‌కుల్ని రోమాంచితుల్ని చేసే క్ర‌మంలో ప్రేక్ష‌కుడిని క‌థ‌లో, సీన్‌ల‌లో లీనం చేస్తూ హార్డ్ కోర్ యాక్ష‌న్ సీన్‌ల‌కు తెర‌లేపుతున్నారు.

మార్కో, ధురంధ‌ర్ బోర్డ‌ర్ క్రాస్‌...

వెంఇతెర‌పై హ‌ద్దులు మీరిన హింస‌ని అందించ‌డంలో మ‌ల‌యాళ మూవీ `మార్కో`, బాలీవుడ్ ఫిల్మ్ `ధురంధ‌ర్` బోర్డ‌ర్ క్రాస్ చేసేశాయి. ఈ సినిమాల్లో చూపించినంత హార్డ్ కోర్ హింస ఇంత వ‌ర‌కు ఏ సినిమాలోనూ చూపించ‌లేదు. మ‌రీ ముఖ్యంగా ఉన్నిముకుంద‌న్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళ మూవీ `మార్కో` ఈ త‌ర‌హా సీన్‌ల‌కు ప‌రాకాష్ట‌గా నిలిచి అవాక్క‌య్యేలా చేసింది. సినిమా టైటిల్ కార్డ్‌లోనే బ్ల‌డ్ పారించి ఈ మూవీ ఎలా ఉంటుంద‌న్న‌ది ముందే హింట్ ఇచ్చారు. సినిమాలోని ప్ర‌తి ప్ర‌తీకారం నేప‌థ్‌యంలో వ‌చ్చే సీన్ బ్ల‌డ్‌తో నిండిపోయి మ‌నం చూస్తున్న‌ది ఇండియ‌న్ మూవీయేనా అనే ఫీలింగ్‌ని క‌లిగించింది.

ఇదే పంథాలో `ధురంధ‌ర్‌`లోని సీన్‌లు కూడా ఉన్నాయి. మార్కెట్‌లో బాబు డ‌కాయ‌త్‌ని అక్ష‌య్ ఖ‌న్నా క్యారెక్ట‌ర్ మ‌ర్డ‌ర్ చేసే స‌న్నివేశం నుంచి ఇండియ‌న్ ఏజెంట్‌ని ఐఎస్ ఐ ఏజెంట్ బంధించి హింసించే స‌న్నివేశాలు.. రెహ‌మాన్ డ‌కాయిత్ క్యారెక్ట్‌ని హమ్జా హ‌త్య చేసే సీన్ వ‌ర‌కు బ్ల‌డ్ షేడ్స్ ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంటాయి. ఫ‌స్ట్ పార్ట్‌లోనే ఈ స్థాయిలో ర‌క్త‌పాతాన్ని సృష్టించిన ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ సెకండ్ పార్ట్‌లో మాత్రం బ్ల‌డ్ బాత్ అనే స్థాయిలో సీన్‌ల‌ని చూపించ‌బోతున్న‌ట్టుగా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో స్ప‌ష్ట‌మైంది. యానిమ‌ల్ మూవీ ఎండింగ్‌లోనూ ఇదే త‌ర‌హాలో వ‌యోలెన్స్‌కి ప‌రాకాష్ట అన్న‌ట్టుగా చూపించిన విష‌యం తెలిసిందే. ఇక యానిమ‌ల్ పార్క్‌లో అంత‌కు మించి అన్న‌ట్టుఆ హింసాత్మ‌క స‌న్నివేశాలు ఉండ‌నున్నాయి.

తెలుగు సినిమాల్లోనూ..

మ‌ల‌యాళ‌, హిందీ సినిమాల్లోనే క‌నిపించిన ఈ హార్డ్ కోర్ యాక్ష‌న్ స‌న్నివేశాలు తెలుగులోనూ క‌నిపించ‌డం మొద‌లైంది. దానికి శ్రీ‌కారం చుట్టింది నేచుర‌ల్ స్టార్ నాని `హిట్ ది థ‌ర్డ్ కేస్‌`. ఇందులో వ‌చ్చే ఫైన‌ల్ యాక్ష‌న్ సీక్వెన్స్‌ని ఎంత భ‌యాన‌కంగా ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను డిజైన్ చేశాడో చూసిన వారికి పరిచ‌య‌మే. త్వ‌ర‌లో రానున్న ది ప్యార‌డైజ్‌లోనూ ఇంత‌కు మించి స‌న్నివేశాలు ఉంటాయ‌ని ఫ‌స్ట్ వీడియోతో క్లారిటీ వ‌చ్చేసింది. పీరియ‌డ్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీలో నాని రూత్‌లెస్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి షాక్ ఇవ్వ‌బోతున్నాడు.

మ‌ద‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమా వ‌యోలెన్స్ సీన్స్ ప‌రంగా హాట్ టాపిక్‌గా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. కార‌ణం నాని క్యారెక్ట‌ర్‌తో పాటు శికంజ మాలిక్ పాత్ర‌లో న‌టిస్తున్న మోహ‌న్ బాబు మేకోవ‌ర్. ఇదే త‌ద‌ర‌హా బ్ల‌డ్ షేడ్‌తో చిరుతో శ్రీ‌కాంత్ ఓదెల చేయ‌నున్న మూవీ కూడా ఉండే అవ‌కాశం ఉంది. ఆ విష‌యాన్ని అనౌన్స్‌మెంట్ పిక్‌తో చిరు, శ్రీ‌కాంత్ రెండు చేతుల‌కు బ్లడ్ పూసుకుని క‌నిపించ‌డం తెలిసిందే. యాష్ `టాక్సిక్‌` కూడా ఇదే బాట‌లో రానుంది. విశ్వ‌క్ సేన్ `క‌ల్ట్‌`తో పాటు `బ్ల‌డ్ ఫెస్ట్` అనే క్యాప్ష‌న్‌తో శ‌ర్వానంద్ హీరోగా రానున్న `భోగి` కూడా ఇదే త‌ర‌హా హార్డ్ కోర్ వ‌యోలెన్స్‌తో రానుంది.