పీక్స్ లో హారర్ లెవెల్స్ ? కొత్త ఈవిల్ డెడ్ పై ఊహించని టాక్ ?
ప్రపంచవ్యాప్తంగా హారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కల్ట్ సిరీస్ ‘ఈవిల్ డెడ్’ నుంచి మరో భయంకరమైన సినిమా వచ్చేసింది.
By: Madhu Reddy | 11 July 2026 3:34 PM ISTప్రపంచవ్యాప్తంగా హారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కల్ట్ సిరీస్ ‘ఈవిల్ డెడ్’ నుంచి మరో భయంకరమైన సినిమా వచ్చేసింది. అదే ‘ఈవిల్ డెడ్ బర్న్’ జనాన్ని వణికించడానికి సరికొత్తగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించని రెస్పాన్స్ వస్తోంది. పాత సినిమాల రేంజ్ భయాన్ని అందిస్తూ, రక్తపాతం, వయోలెన్స్‌తో థియేటర్లలో హారర్ లవర్స్‌కు ఈ సినిమా పూనకాలు తెప్పిస్తోంది. అసలు ఈ కొత్త పార్ట్ ఎలా ఉందో, ఎలాంటి టాక్ తెచ్చుకుందో ఇప్పుడు చూద్దాం.
భయపెట్టిన ‘ఈవిల్ డెడ్’ హిస్టరీ:
1981లో మొదటిసారి ‘ఈవిల్ డెడ్’ సినిమా వచ్చినప్పుడు థియేటర్లలో ఆడియన్స్ భయంతో వణికిపోయారు. చాలా తక్కువ బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఇఉక్ ఆ తర్వాతే దెయ్యాల సినిమాలకు ఒక ట్రెండ్ మొదలైంది. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో వచ్చిన ఐదు భాగాలు కూడా ప్రేక్షకులను బాగానే భయపెట్టాయి. 2023లో వచ్చిన ‘ఈవిల్ డెడ్ రైజ్’ తర్వాత, ఇప్పుడు వచ్చిన ‘ఈవిల్ డెడ్ బర్న్’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తెలుగు థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ: సాధారణంగా హాలీవుడ్ హారర్ సినిమాలకు మన దగ్గర మంచి క్రేజ్ ఉంటుంది. తాజాగా రిలీజైన ఈ కొత్త ఈవిల్ డెడ్ సినిమాకు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక వీకెండ్‌లో హారర్ థ్రిల్స్ ఎంజాయ్ చేయాలనుకునే మూవీ లవర్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా, కేవలం ఈ బ్రాండ్ నేమ్ చూసే జనాలు థియేటర్లకు వస్తుండటం విశేషం.
అసలు కథేంటంటే?:
ఈ సినిమా స్టోరీ లైన్ ఎప్పటిలాగే పాతదే. భర్తను కోల్పోయిన ఆలీస్ అనే మహిళ.. తన ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా ఉండటానికి ఒక దట్టమైన అడవి ప్రాంతంలోని ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్లకు ‘బుక్ ఆఫ్ డెడ్’ అనే ప్రమాదకరమైన పుస్తకం దొరుకుతుంది. ఇక దాంతో అక్కడి ఆత్మలన్నీ మేల్కొంటాయి. ఆలీస్ కుటుంబ సభ్యులే దెయ్యాలుగా మారి ఒకరినొకరు చంపుకోవడానికి చూస్తారు. ఈ రక్తపాతం నుంచి ఆమె ఎలా ప్రాణాలతో బయటపడింది అనేదే మిగతా కథ.
నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్లే, థ్రిల్స్:
కథ పాతదే అయినా.. డైరెక్టర్ సెబాస్టియన్ వానిసెక్ ఈ సినిమాను నడిపించిన విధానం బాగుంది. సినిమాలో విపరీతమైన రక్తపాతం, వయోలెన్స్ సీన్లు ఉన్నాయి. హారర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ ఎపిసోడ్స్ థియేటర్‌లో ఫుల్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తాయి. ఇక అక్కడక్కడా కొద్దిగా సాగదీసినట్టు అనిపించినా క్లైమాక్స్ వైపు వెళ్లేకొద్దీ వచ్చే హారర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ సీన్స్ ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడతాయి.
కథలో పెద్దగా కొత్తదనం ఆశించకుండా కేవలం ప్యూర్ హారర్, రక్తపాతం చూడాలనుకునే వారికి ‘ఈవిల్ డెడ్ బర్న్’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఇక ఈ సిరీస్‌కు ఉన్న వీర ఫ్యాన్స్ అయితే థియేటర్లలో ఈ హారర్ రైడ్‌ను బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీకెండ్‌లో గట్టిగా భయపడాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాపై ఒక లుక్ వేసేయండి..
