Begin typing your search above and press return to search.

సినిమా ప్లాపైతే దానికి పూర్తి బాధ్యత ఎవ్వరు వహించాల్సి ఉంటుంది?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఒక కథను నమ్మి ఎంటైర్ టీం మొత్తం కథ మీద వర్క్ చేస్తూ సినిమాని తెరమీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు.

By:  Gopi Velupala   |   27 Sept 2026 12:00 PM IST
సినిమా ప్లాపైతే దానికి పూర్తి బాధ్యత ఎవ్వరు వహించాల్సి ఉంటుంది?
X

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఒక కథను నమ్మి ఎంటైర్ టీం మొత్తం కథ మీద వర్క్ చేస్తూ సినిమాని తెరమీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే ఎక్కడో ఒకచోట కొన్ని తప్పులు జరగడం వల్ల సినిమా అనుకున్న రేంజ్ లో ప్రేక్షకుడిని మెప్పించలేక పోతుంది దానివల్ల సినిమా ఫ్లాప్ అవుతుంది. మరి కొన్ని సందర్భాల్లో టీమ్ అంతా కష్టపడి మూవీని అత్యద్భుతంగా తీర్చిదిద్దినప్పుడు సినిమా సక్సెస్ ని సాధిస్తుంది. సినిమా అనేది టీం వర్క్ ఏ ఒక్కరి వల్లో సినిమాకి సక్సెస్ అనేది రాదు. మూవీ హిట్ అయినా దాని క్రెడిట్ టీమ్ మొత్తానికి వస్తుంది. మూవీ ఫ్లాప్ అయిన దాని పూర్తి బాధ్యతను టీమ్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది... సినిమా అనేది ఒక్కరు పూర్తి చేసేది కాదు. ఒకరు కథని రాస్తే దర్శకుడు సినిమాని స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాడు. నటుడు యాక్టింగ్ పరంగా తెరమీద కనిపిస్తూ ప్రేక్షకులను మైమరపింపజేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక ప్రొడ్యూసర్ దానికి కావాల్సిన డబ్బులను సమకూరుస్తూ ఉంటాడు... సంగీత దర్శకుడు ఈ సినిమాకి పాటలను అందిస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. సినిమాటోగ్రాఫర్ సినిమాలో ఎలాంటి విజువల్స్ ఎలా ఉంటే బాగుంటుంది. దాన్ని మనం ఎలా క్యాప్చర్ చేయాలనేది చూసుకుంటాడు.

ఇక ఇదంతా జరిగిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సినిమా రిజల్ట్ ను మార్చేస్తుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ పనిని వాళ్ళు సక్రమంగా చేసినప్పుడు సక్సెస్ వస్తుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా సినిమా రిజల్ట్ తేడా కొట్టే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఆ టెక్నీషియన్ పర్ఫెక్ట్ గా తన వర్క్ ని చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలియకుండా కూడా కొన్ని మిస్టేక్స్ అయితే జరగొచ్చు దాని వల్ల కూడా సినిమా ఫ్లాప్ అవుతుంది. కాబట్టి సినిమా సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయిన దానికి పూర్తి బాధ్యతను టీమ్ వహించాల్సి ఉంటుంది...

కొన్ని సందర్భాల్లో సినిమా సక్సెస్ అయితే క్రెడిట్ మొత్తం కొంతమంది కొట్టేయాలని చూస్తారు. కానీ అది సరైన విషయం కాదు. ఇక ఫ్లాప్ అయినప్పుడు పక్క వాళ్ళ మీద నెట్టి వేయడానికి ప్రయత్నిస్తుంటారు. అది కూడా సరైనది కాదు. సినిమా అనేది టీం వర్క్ ఏ ఒక్కరు లేకపోయిన, వాళ్ళ పనిని వారు పూర్తిగా నిర్వర్తించకపోయినా కూడా సినిమా మొదటికే మోసం వచ్చే అవకాశాలైతే ఉన్నాయి...