Begin typing your search above and press return to search.

'విరోష్' రిసెప్షన్.. అసలు తారక్ డూప్ ఏం చేశాడు?

స్టార్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   9 March 2026 12:52 PM IST
విరోష్ రిసెప్షన్.. అసలు తారక్ డూప్ ఏం చేశాడు?
X

స్టార్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వరుసగా కొన్ని రోజుల పాటు పెళ్లి ఈవెంట్స్ జరగ్గా.. ప్రస్తుతం రిలాక్సింగ్ మోడ్ లో ఉన్నారు. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయ్ పూర్ లో విరోష్ పెళ్లి జరగ్గా.. మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ జరిగింది. ఆ ఈవెంట్ కు సినీ, రాజకీయ రంగాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరయ్యారు.

సినీ ఇండస్ట్రీలోని స్టార్ క్యాస్టింగ్ మాత్రమే కాకుండా.. విజయ్, రష్మిక తమకు పరిచయం ఉన్న అనేక మంది జూనియర్ ఆర్టిస్టులను కూడా ఆహ్వానించడం విశేషం. అందులో సోషల్ మీడియాలో హైలైట్ అయిన వారిలో ఒకరు ఈశ్వర్.. ఆ పేరు వింటే ఎవరికీ బహుశా గుర్తుకు రాకపోవచ్చు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు డూప్ గా ఈశ్వర్ పలు సినిమాల్లో యాక్ట్ చేశారు.. ఇప్పటికీ చేస్తున్నట్లు తెలుస్తోంది!

అయితే తారక్ డూప్ కు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ ఆహ్వానం అందగా.. వెళ్లి కొత్త జంటకు విషెస్ చెప్పి ఫొటోలు దిగారు. కానీ ఆ పిక్స్ కన్నా సోషల్ మీడియాలో ఓ వీడియో ఫుల్ వైరల్ అయింది. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బౌన్సర్లు.. ఈశ్వర్ ను పక్కకు నెడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో అసలేం జరిగిందోనని, అక్కడ తారక్ డూప్ ఏం చేశాడోనని మాట్లాడుకుంటున్నారు.

దానిపై ఇప్పుడు ఈశ్వర్ సోషల్ మీడియాలో డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చాడు. ఆ రోజు జరిగినది చాలా చిన్న విషయమని, కానీ నెట్టింట అదొక పెద్ద విషయంగా వైరల్ అయిందని చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. అయితే చాలా మంది ఆ వీడియోలో ఉన్నది తానేనని గుర్తు పట్టారని, మరికొందరు మాత్రం డౌట్ పడ్డారని చెప్పారు. కానీ అందులో అల్లు అర్జున్ బౌన్సర్లు నెట్టింది తననేని వెల్లడించాడు.

నిజానికి అల్లు అర్జున్‌ రిసెప్షన్ లోపలకు వెళ్ళే సమయంలో తాను కూడా లోపలికి వెళ్తున్నానని పేర్కొన్నాడు. అక్కడే ఉన్న ఫొటో బూత్ వద్ద ఆయన సడన్‌ గా ఆగిపోయారని చెప్పాడు. తాను ఇంతలో బన్నీతో ఫొటో దిగడానికి వెళ్తున్నానుకుని బౌన్సర్లు భ్రమపడ్డారేమో... లేదంటే కెమెరాకు అడ్డొస్తానని భావించారేమో.. తను వెంటనే పక్కకు జరిపి ఆపేశారని తెలిపాడు.

అయితే స్టార్ హీరోల ప్రీమిసెస్ లో అది చిన్న విషయమని, దాన్ని జూమ్‌ చేస్తూ చాలా పెద్దగా సోషల్ మీడియాలో చూపించారని చెప్పాడు ఈశ్వర్. అలా తన వీడియో చాలా వైరల్‌ చేయడంతో మంచి రీచ్ వచ్చిందంటూ థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈశ్వర్ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. అల్లు అర్జున్ తన బ్రదర్ అల్లు శిరీష్ మ్యారేజ్ ఈవెంట్స్ బిజీలో ఉన్నా కూడా.. విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు అటెండ్ అయ్యారు.