పాండ్యాతో డేటింగ్‌పై బాలీవుడ్ బ్యూటీ క్లారిటీ
ఇటీవల ఈషా వెబ్ సిరీస్ లలోను మెరుస్తోంది. ఇక రెగ్యులర్ గా ర్యాంప్ షోలతోను గ్లామ్ ప్రపంచానికి టచ్ లో ఉంది. అయితే ఈషా గుప్తా డేటింగుల గురించి అంతగా సమాచారం లేదు.
By: Sivaji Kontham | 3 Aug 2025 4:00 AM ISTఈషా గుప్తా.. పరిచయం అవసరం లేదు. టాప్ మోడల్.. ఫ్యాషనిస్టాగా సుపరిచితురాలు. బాలీవుడ్ లో పలు భారీ చిత్రాల్లో నటించింది. రామ్ చరణ్ `వినయ విధేయ రామా` చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో ఇషా నర్తించిన సంగతి తెలిసిందే. ఇషా బో*ల్డ్.. పైగా సూటిగా మాట్లాడుతుంది.. కొన్నిసార్లు ఘాటైన స్టేట్‌మెంట్లతోను వార్తల్లో నిలిచింది. వీటన్నిటినీ మించి వెబ్ లో ఇషాజీ గ్లామర్ ట్రీట్, నిరంతరం బోల్డ్ ఫోటోషూట్లు వేడెక్కిస్తూనే ఉన్నాయి. బికినీలు, స్విమ్ సూట్లలో చెలరేగడంలో ఈషా గుప్తా ప్రత్యేకతే వేరు... తన ఇన్ స్టా ఫాలోవర్స్ కోసం నిరంతరం ఏదో ఒక స్పెషల్ ట్రీట్‌ని ఇస్తూనే ఉంది.
రెండు నెలలు మా మధ్య మాటలు..
ఇటీవల ఈషా వెబ్ సిరీస్ లలోను మెరుస్తోంది. ఇక రెగ్యులర్ గా ర్యాంప్ షోలతోను గ్లామ్ ప్రపంచానికి టచ్ లో ఉంది. అయితే ఈషా గుప్తా డేటింగుల గురించి అంతగా సమాచారం లేదు. ఈషా గతంలో క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో కొంతకాలం డేటింగ్ లో ఉందని పుకార్లు వచ్చాయి. అయితే పాండేతో డేటింగ్ నిజమా? అంటూ సిద్ధార్థ్ కన్నన్ తన ఇటీవలి పాడ్ కాస్ట్ లో ఇషాజీని ప్రశ్నించాడు. అయితే హార్థిక్ తో డేటింగ్ ని ఈషా కొట్టి పారేసింది. ``మేం రెండు నెలల పాటు మాట్లాడుకున్నాం. అయితే డేటింగ్ చేసామని అనుకోను`` అని వ్యాఖ్యానించింది. కొద్దిరోజుల పరిచయం అనుబంధంగా మారలేదని ఇషా గుప్తా వందశాతం క్లారిటీనిచ్చింది.
టచ్‌లో లేకపోవడం వల్లనే..
బిజీ షెడ్యూళ్ల కారణంగా దూరమయ్యాం కానీ, అతడితో డేట్ చేసేదానినేమో! అని కూడా ఇషా గుప్తా వ్యాఖ్యానించారు. సిద్ధార్థ్ కన్నన్ తో సరదా సంభాషణల్లో ఇషాజీ ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో పాండ్యాతో ఇషా డేట్ గురించి కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ లోను ప్రశ్న ఎదురైంది. కానీ దానికి సరైన సమాధానం లేదు. తామిద్దరం టచ్ లేకపోవడం వల్లనే మిస్సయ్యామని పరోక్షంగా ఇషా గుప్తా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. మేం మాట్లాడుకునేవాళ్లం.. కానీ కలుసుకునే సమయం లేదని కూడా ఈషా స్పష్టంగా చెప్పుకొచ్చారు.
ఈషా గుప్తా గత ఐదేళ్లుగా స్పానిష్ మోడల్ మాన్యుయెల్ కాంపోస్ గుల్లార్‌తో డేటింగ్ లో ఉంది. అతడితో తన సంబంధాన్ని సోషల్ మీడియాల వేదికగా ఈషా అధికారికంగా ధృవీకరించింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే ఇషా గుప్తా నటనా కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. 2019లో టోటల్ ధమాల్ తర్వాత పెద్దగా ఆఫర్లు ఏవీ లేవు. ప్రస్తుతం దేశీ మ్యాజిక్ అనే సినిమాలో నటిస్తోంది. ఇషా ప్రస్తుతం బుల్లితెర షోలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
