Begin typing your search above and press return to search.

ఆదిత్య 'ఎపిక్' ప్లాన్.. నాగవంశీ చెప్పినట్లు చేసి ఉంటే..

తాను చెప్పాలనుకున్న కథను జెన్యూన్‌ గా చూపించడానికే ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు నాగవంశీ తెలిపారు.

By:  M Prashanth   |   12 Sept 2026 9:15 AM IST
ఆదిత్య ఎపిక్ ప్లాన్.. నాగవంశీ చెప్పినట్లు చేసి ఉంటే..
X

సినిమా అంటే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలి.. స్టోరీ ఎంత నేచురల్ గా ఉన్నా, అక్కడక్కడా నవ్వించాలి.. ముఖ్యంగా సెకండాఫ్‌ లో ఎంటర్టైన్మెంట్ తగ్గితే ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుంది. ఇప్పుడు ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ విషయంలో ఇదే చర్చ జరుగుతోంది. సెకండాఫ్‌ లో కామెడీ ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే విషయంపై నిర్మాత నాగవంశీ దర్శకుడు ఆదిత్య హాసన్ ను క్వశ్చన్ చేశారు.

రీసెంట్ గా ప్రెస్ మీట్ లో సెకండాఫ్‌ లో ఏదో మిస్ అయిందని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారని, కామెడీ పెడదామంటే 'ఏమన్నావ్ ఆదిత్య.. చెప్పు నీవే.. ఆ మాత్రం తెలియదా అని అనుకుంటున్నారు' అంటూ దర్శకుడినే నాగవంశీ సరదాగా ప్రశ్నించారు. దీంతో సినిమా విషయంలో ఆదిత్య ఎంత క్లారిటీతో ఉన్నారో చెప్పే ప్రయత్నం చేశారు. కామెడీ యాడ్ చేస్తే సినిమా మరింత కమర్షియల్‌ గా మారే అవకాశం ఉన్నా.. ఆదిత్య హాసన్ మాత్రం అలా చేయలేదట.

తాను చెప్పాలనుకున్న కథను జెన్యూన్‌ గా చూపించడానికే ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు నాగవంశీ తెలిపారు. అంటే ప్రేక్షకుడిని మెప్పించడానికి కథలో అవసరం లేని ఎలిమెంట్స్ యాడ్ చేయడం కంటే, తనకు నమ్మకం ఉన్న కథను ఉన్నట్టుగానే చెప్పాలనుకున్నాడన్నమాట. ఇదే విషయాన్ని ఆదిత్య హాసన్ కూడా క్లియర్ గా చెప్పారు. ఎపిక్ తన లైఫ్ కు దగ్గరగా ఉండే కథ అని తెలిపారు. యూకేలో తాను చూసిన, ఎక్స్పీరియన్స్ చేసిన చాలా విషయాలను సినిమాలో పెట్టినట్లు చెప్పారు.

సినిమాటిక్ గా కాకుండా నేచురల్ గా చూపించాలనుకున్నట్లు వివరించారు. యూఎస్‌ లో ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉండే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయని, యూకేలో మాత్రం అలా ఉండదని చెప్పారు. తాను కూడా యూకేలో ఉన్నప్పుడు సింగిల్ రూమ్‌ లోనే ఉన్నానని గుర్తుచేసుకున్నారు. తన ఎక్స్పీరియన్సెస్ నుంచి పుట్టిన సీన్స్ ను సినిమాలో యూజ్ చేసినట్లు తెలిపారు. చాలా సీన్స్ తనకు తెలిసినవి ఉంటాయని చెప్పారు.

అయితే ఇలాంటి స్టోరీకి డివైడ్ రెస్పాన్స్ వస్తుందని తనకు ముందే అనుమానం ఉందని ఆదిత్య చెప్పడం మరో ఇంట్రెస్టింగ్ విషయం. అయినా తాను అనుకున్న విధంగానే సినిమా తీశానని స్పష్టం చేశారు. యూకే నుంచి చాలామంది తనకు మెసేజ్‌ లు చేశారని, సినిమా తమకు రిలేట్ అయిందని చెప్పినట్లు తెలిపారు. అదే సమయంలో మిక్స్‌ డ్ టాక్ కూడా వస్తోందని ఒప్పుకొన్నారు.

అయితే ఒకవైపు కమర్షియల్‌ గా పనిచేసే కామెడీని పెంచే అవకాశం ఉన్నా.. మరోవైపు తన కథలోని నేచురాలిటీ మిస్ అవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాడు ఆదిత్య. నాగవంశీ కామెంట్స్ బట్టి చూస్తే.. దర్శకుడు కొంచెం కమర్షియల్ గా ఆలోచించి ఉంటే సెకండాఫ్‌ పై వస్తున్న కంప్లైంట్స్ తగ్గేవేమో. కానీ అలా చేస్తే ఆదిత్య చెప్పాలనుకున్న జెన్యూన్ కథ మారిపోయేదేమో. అందుకే సినిమా థియేటర్స్ లో చూడాలని ఆడియన్స్ ను ఆదిత్య కోరారు.