Begin typing your search above and press return to search.

ఎపిక్ సీక్వెల్ కచ్చితంగా వస్తుందా? ఇప్పుడిదే డౌట్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీగా నటించిన మరో మూవీ ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వేళ.. ఇప్పుడు సోషల్ మీడియాలో సీక్వెల్‌ పై ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది.

By:  M Prashanth   |   12 Sept 2026 11:29 AM IST
ఎపిక్ సీక్వెల్ కచ్చితంగా వస్తుందా? ఇప్పుడిదే డౌట్
X

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీగా నటించిన మరో మూవీ ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వేళ.. ఇప్పుడు సోషల్ మీడియాలో సీక్వెల్‌ పై ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది. అందుకు కారణం నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్సే. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌ లో ఎపిక్ కథపై వస్తున్న విమర్శల గురించి ఆయన మాట్లాడారు. సినిమా స్టోరీని ప్రతి వయసు ప్రేక్షకుడు ఒకేలా అర్థం చేసుకోవడం కష్టమని చెప్పారు.

అయితే అదే సమయంలో మూవీకి సీక్వెల్ ఉండే ఛాన్స్ కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఎపిక్ 2పై నెటిజన్లలో చర్చ మొదలైంది. నిజానికి ఎపిక్ ఫస్ట్ పార్ట్ లో ఆదిత్య, కడలి పాత్రల చుట్టూనే మెయిన్ స్టోరీనే నడుస్తుంది. వారి పరిచయం, జర్నీ, ఒకరిపై ఒకరికి ఏర్పడే ఎమోషన్.. ఇలా ఆ ఇద్దరి రిలేషన్ ను సినిమా మెయిన్ గా చూపిస్తుంది.

అయితే ఒకవేళ ఆ స్టోరీని రెండో పార్టుతో కంటిన్యూ చేస్తే.. అక్కడి నుంచి అసలు కథ ఎలా ముందుకు వెళ్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. నాగవంశీ చెప్పిన మాటల్లో కూడా ఇదే విషయం కనిపిస్తోంది. ఆదిత్య, కడలి స్టోరీ ఇక్కడితో కంప్లీట్ అవుతుందా, లేక వారి జీవితంలో తర్వాత ఏం జరిగిందో కూడా చూపించాలన్న ఆలోచనను ఆయన వెల్లడించారు. మెయిన్ గా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా, మ్యారేజ్ తర్వాత వారి జీవితం ఎలా సాగింది, ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయనే విషయాలను సీక్వెల్‌ లో చూపిస్తామని చెప్పారు.

అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎపిక్ సీక్వెల్ వస్తుందని నిర్మాత చెప్పినప్పటికీ.. వెంటనే షూటింగ్ మొదలవుతుంది, త్వరలోనే థియేటర్లలోకి వస్తుందనే రేంజ్ లో అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. అంటే ఎపిక్ స్టోరీని మరో పార్టుతో కొనసాగించాలనే ఆలోచన నిర్మాతకు ఉంది. కానీ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తున్న వేళ.. సీక్వెల్ వస్తుందో లేదోనన్న డౌట్ మాత్రం సినీ ప్రియుల్లో ఉంది.

అదే సమయంలో ఆదిత్య, కడలి రోల్స్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది కూడా సీక్వెల్ విషయంలో మెయిన్ పాయింట్ గా మారొచ్చు. ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత వారి కథ ఇంకా ముందుకు వెళ్లాలని ప్రేక్షకులు కోరుకుంటే.. రెండో పార్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే సినీ ప్రియుల్లో ఆ ఇంట్రెస్ట్ పెద్దగా కనిపించడం లేదు.

ఏదేమైనా నిజంగానే ఎపిక్ 2 వస్తుందా? వస్తే ఆదిత్య, కడలి స్టోరీలో ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది? వాళ్ల ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా? పెళ్లి తర్వాత ఏం జరుగుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు తెలుస్తుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం నాగవంశీ కామెంట్స్ బట్టి చూస్తే.. ఎపిక్ స్టోరీకి మరో మూవీ తీసే ఆలోచన అయితే ఉన్నట్టే కనిపిస్తోంది. మరి ఆ ఆలోచన సీక్వెల్‌ గా మారుతుందా లేదా అన్నది కాలమే చెప్పాలి.