ఈఎన్ఈ రిపీట్ లో అంత ఓకే కానీ అదొక్కటే మైనస్ అయిందా?
‘ఈఎన్ఈ రిపీట్’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నా, కథను మరింత బలంగా రాసుకుని ఉంటే సినిమా పెద్ద విజయం సాధించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తరుణ్ భాస్కర్ నటనపై కాకుండా దర్శకత్వంపై ఎక్కువ దృష్టి పెట్టి ఏడాదికి కనీసం ఒక సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
By: Gopi Velupala | 23 Nov 2026 1:46 PM IST'పెళ్లి చూపులు' సినిమాతో మ్యాజిక్ క్రియేట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్... ఆ తర్వాత ఆయన యూత్ ను టార్గెట్ చేస్తూ చేసిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. అందులోని డైలాగ్స్ ఇప్పటికి మీమ్స్ లో మనకి కనిపిస్తుంటాయి. అలాంటి సినిమాకి సీక్వెల్ వస్తే చూడాలని చాలా మంది అభిమానులు తరుణ్ భాస్కర్ ను పబ్లిక్ ఈవెంట్స్ లో అడిగారు. సీక్వెల్ చేయాలని ప్రేక్షకుల నుంచి వస్తున్న మెసేజ్ లకు తరుణ్ కూడా ఫిక్స్ అయిపోయి ఎట్టకేలకు 'ఈఎన్ఈ రిపీట్' పేరు తో సినిమా చేశాడు...
తరుణ్ భాస్కర్ ఆ ఒక్కటి చేస్తే బాగుండేదా?
'ఈఎన్ఈ రిపీట్' రిలీజైన మొదటి షో నుంచి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. అభినవ్ గోమట్టం కామెడీ బాగా వర్కౌట్ అయింది. డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. నటీనటులు పర్ఫామెన్స్ తో మెప్పించారు. అయితే దర్శకుడు మాత్రం లైట్ వెయిట్ కథతో సినిమాను తీసుకెళ్లాడు. సెకండాఫ్ అంత ఒకే దగ్గర జరగడంతో కొంచెం లాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. అలాగే సైకో వివేక్ (విశ్వక్ సేన్ కి ఫస్ట్ పార్ట్ లో ఉన్న గుర్తింపు ఇందులో లేదు. ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ను పర్ఫెక్ట్ గా డిజైన్ చేయలేకపోయారు. ఎప్పుడు తన ఈగో ను చూపించుకునే క్యారెక్టర్ గానే మలిచారు. నిజానికి మొదటి పార్ట్ లోని క్యారెక్టర్స్ ను బట్టే సెకండ్ పార్ట్ డిజైన్ చేసినప్పటికి కథ ను ఇంకొంచెం స్ట్రాంగ్ గా రాసుకుంటే ఈ సినిమా ఇంకా పెద్ద విజయాన్ని సాధించేది.
తరుణ్ భాస్కర్ రెగ్యులర్ గా సినిమాలు చేయవచ్చు కదా
తరుణ్ భాస్కర్ కి డైరెక్షన్ పరంగా మంచి నాలెడ్జ్ ఉన్నప్పటికి ఆయన దానిని పక్కనపెట్టి యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. రీసెంట్ గా దిల్ రాజు సైతం ఈఎన్ఈ రిపీట్ ప్రీ రిలీజ్ లో తరుణ్ నుంచి సంవత్సరానికి ఒక్క సినిమా వచ్చిన ఇండస్ట్రీ కి బాగా హెల్ప్ అవుతుందని చెప్పాడు. మొత్తానికి ఈ ఎన్ ఈ రిపీట్ ను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తరుణ్ ఫుల్ టైమ్ డైరెక్షన్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని అతని అభిమానులు కోరుకుంటున్నారు...
