Begin typing your search above and press return to search.

ఈ నగరానికి ఏమైంది -2 రిలీజ్ డేట్ లాక్.. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

టాలీవుడ్‌లో యూత్‌కు పిచ్చపిచ్చగా నచ్చేసిన కల్ట్ క్లాసిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ వచ్చేస్తోంది.

By:  Madhu Reddy   |   29 Jun 2026 4:23 PM IST
ఈ నగరానికి ఏమైంది -2 రిలీజ్ డేట్ లాక్.. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
X

టాలీవుడ్‌లో యూత్‌కు పిచ్చపిచ్చగా నచ్చేసిన కల్ట్ క్లాసిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ వచ్చేస్తోంది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మార్క్ మేకింగ్‌తో అప్పట్లో థియేటర్లలోనే కాదు, రీ-రిలీజ్‌లోనూ రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా పార్ట్ 2 అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది. క్రేజీ టైటిల్‌తో పాటు ఒక అదిరిపోయే మోషన్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ఈ క్రేజీ గ్యాంగ్ మళ్లీ ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేయబోతోందోనని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.





ఐకానిక్ కన్యా రాశి గ్యాంగ్ ఈజ్ బ్యాక్:

నలుగురు మధ్యతరగతి స్నేహితుల గోవా ట్రిప్, వారి లక్ష్యాలు, తాగుడు ముచ్చట్లతో సాగే కథే 'ఈ నగరానికి ఏమైంది'. విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమానుల యాక్టింగ్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాను ఒక వైబ్‌లా మార్చేశాయి. ఇక ఇప్పుడు ఇదే ఐకానిక్ గ్యాంగ్ సీక్వెల్ కోసం మళ్లీ చేతులు కలపడంతో సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది. "బ్రో దిస్ ఈజ్ అవర్ వైబ్.. బ్రో ఇది మళ్లీ వస్తుంది" అంటూ నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.

ఈఎన్ఈ రిపీట్.. క్రేజీ టైటిల్ అండ్ ట్యాగ్ లైన్:

ఈ సీక్వెల్‌కు ఇంగ్లీష్, తెలుగు మిక్స్ చేసి డిజైన్ చేసిన లోగో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా "ఏలినాటి శని అయిపోయింది.. కన్యా రాశి టైం వచ్చింది" అంటూ పెట్టిన ట్యాగ్ లైన్ నవ్వులు పూయిస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇక గాలిలో ఎగురుతున్న బ్రీఫ్‌కేస్, బట్టలు, బీర్ బాటిళ్లు, సన్‌గ్లాసెస్, ఫ్లైట్ టికెట్లతో కూడిన మోషన్ పోస్టర్ చూస్తుంటే ఈసారి ట్రిప్ అంతకుమించి ఉండబోతుందని అర్థమవుతోంది.

ప్రీ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ బిజీ:

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.సురేష్ బాబుతో పాటు సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాత టీమ్ అయిన కెమెరామెన్ ఏజే ఆరోన్, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, ఎడిటర్ రవితేజ గిరిజాల ఈ ప్రాజెక్ట్‌కి కూడా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

మొదటి భాగం యూత్‌కు ఒక బెంచ్‌మార్క్‌లా నిలిచిపోయింది. ఇప్పుడు వస్తున్న సీక్వెల్ కూడా అదే రేంజ్ వినోదాన్ని అందించి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఇక ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్లలో ఊగిపోవడానికి ఇదొక పర్ఫెక్ట్ ఫిల్మ్ కానుంది. మరి మన కన్యా రాశి గ్యాంగ్ ఈసారి ఎలాంటి అడ్వెంచర్ టూర్‌తో మన ముందుకు వస్తారో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి..