Begin typing your search above and press return to search.

ఈసారి లెక్క మారుతోంది.. 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ కోసం భారీ స్కెచ్!

షూటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తరుణ్ భాస్కర్ తన టీమ్‌తో కలిసి థాయ్‌లాండ్ షెడ్యూల్ కోసం పక్కాగా రెడీ అయ్యారు.

By:  M Prashanth   |   28 Jan 2026 9:00 PM IST
ఈసారి లెక్క మారుతోంది.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కోసం భారీ స్కెచ్!
X

టాలీవుడ్‌లో యూత్ ఫుల్ కల్ట్ సినిమాలకు దర్శకుడు తరుణ్ భాస్కర్ నెక్స్ట్ సినిమాకు చాలా టైమ్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. స్నేహం, గోవా ట్రిప్, షార్ట్ ఫిలిం మేకింగ్ చుట్టూ తిరిగే 'ఈ నగరానికి ఏమైంది' సినిమా ఒక జనరేషన్‌ను ఎలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్నేళ్లయినా ఆ సినిమా మీమ్స్ సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందనే వార్త ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను పెంచేసింది. 'ద బాయ్స్' మళ్ళీ రాబోతున్నారనే వార్తతో నెట్టింట హడావుడి మొదలైంది.

సీక్వెల్ అనగానే సాధారణంగా మొదటి భాగం కంటే కాస్త పెద్దగా ప్లాన్ చేస్తారు. కానీ తరుణ్ భాస్కర్ ఈసారి ఊహించని రేంజ్‌లో అడుగులు వేస్తున్నారు. కేవలం ఒక సింపుల్ ఫ్రెండ్‌షిప్ డ్రామాగా కాకుండా, ఈ ప్రయాణాన్ని గ్లోబల్ లెవల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. సుశాంత్ (కార్తీక్ క్యారెక్టర్) వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నా, ఆ పాత్రను మాత్రం కొనసాగిస్తూనే కొత్త నటుడితో మేజిక్ చేయడానికి టీమ్ సిద్ధమైంది.

ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే 'ఈ నగరానికి ఏమైంది 2' ENE Repeat కోసం ఏకంగా 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయించారని టాక్ వస్తోంది. మొదటి భాగం చాలా పరిమితమైన బడ్జెట్‌తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి మేకింగ్ వాల్యూస్ విషయంలో ఎక్కడా తగ్గకూడదని మేకర్స్ డిసైడ్ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ కోసం ఈ రేంజ్ బడ్జెట్ అంటే బాక్సాఫీస్ దగ్గర గట్టి ప్లానే ఉందని అర్థమవుతోంది. తరుణ్ భాస్కర్ విజన్ కు తగ్గట్టుగా నిర్మాతలు కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు.

ఈ భారీ బడ్జెట్‌ను కేవలం టెక్నికల్ వాల్యూస్ కోసమే కాకుండా, లొకేషన్ల కోసం కూడా భారీగా వెచ్చిస్తున్నారట. ఈ సినిమాలోని దాదాపు 50 శాతం షూటింగ్ థాయ్‌లాండ్‌లోని అందమైన లొకేషన్లలో జరగబోతోంది. గోవా ట్రిప్ తో మొదలైన ఈ స్నేహితుల ప్రయాణం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్‌కు షిఫ్ట్ అవ్వబోతోంది. థాయ్‌లాండ్ అందాలతో పాటు అక్కడి యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ఒక కొత్త కలర్ తీసుకురానున్నాయి. విజువల్స్ పరంగా ఈ సీక్వెల్ ఒక గ్రాండియర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వబోతోందని ఇదివరకే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

షూటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తరుణ్ భాస్కర్ తన టీమ్‌తో కలిసి థాయ్‌లాండ్ షెడ్యూల్ కోసం పక్కాగా రెడీ అయ్యారు. స్నేహితుల మధ్య ఉండే ఆ రియలిస్టిక్ ఫన్, క్రేజీ డైలాగ్స్ ఈసారి గ్లోబల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎలా ఉంటాయో చూడాలని ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బడ్జెట్ పెరగడం వల్ల కంటెంట్ లో కూడా అదే స్థాయి ఇంటెన్సిటీ ఉంటుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

అనవసరమైన హడావుడి లేకుండా క్వాలిటీ మీద దర్శకుడు ఫోకస్ పెడుతున్నారు. 'ENE రిపీట్' బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద రిస్క్ తో కూడిన అడ్వెంచర్ లా అనిపిస్తోంది. 40 కోట్లు అంటే అది చిన్న విషయం కాదు. థాయ్‌లాండ్ షెడ్యూల్ సినిమాకు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి. ఆ నలుగురు స్నేహితుల గ్యాంగ్ మళ్ళీ థియేటర్లలో ఏ రేంజ్ లో నవ్వులు పూయిస్తారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.