ఆస్తుల సామ్రాజ్యం: 105 కోట్ల నెట్ వర్త్ !
హష్మీ ప్రతి సినిమాకు 6 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు లాభాల్లో కూడా వాటా తీసుకునే పద్ధతిని అనుసరిస్తున్నారు.
By: Srikanth Kontham | 11 Aug 2026 1:15 PM ISTబాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఇమ్రాన్ హష్మీ గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇమ్రాన్ హష్మీ సుదీర్ఘ సినీ ప్రయాణంలో విభిన్నమైన జోనర్లలో నటిస్తూ వచ్చిన ఆయన కేవలం సినిమాల ద్వారానే కాకుండా వ్యాపార రంగంలోనూ రాణిస్తూ భారీ సంపదను సమకూర్చుకుంటున్నారు. తాజాగా అందిన నివేదికల ప్రకారం ఇమ్రాన్ హష్మీ మొత్తం నిట్ వర్త్ (ఆస్తుల విలువ) 105 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇమ్రాన్ హష్మీ సంపాదనలో ప్రధాన భాగం సినిమా రెమ్యూనరేషన్లు .. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారానే వస్తోంది.
హష్మీ ప్రతి సినిమాకు 6 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు లాభాల్లో కూడా వాటా తీసుకునే పద్ధతిని అనుసరిస్తున్నారు. అలాగే ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం కల్పిస్తూ ఒక్కో ప్రకటన ద్వారా కోట్ల రూపాయలను ఆర్జిస్తూ ఆర్థిక సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుంటున్నారు. సినిమాలతో పాటు లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఇమ్రాన్ హష్మీ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రా (పాలి హిల్)లో 16 నుంచి 25 కోట్ల విలువైన విలాసవంతమైన 4బీహెచ్ కె అపార్ట్‌మెంట్ ఉంది.
అంతేకాదు ముంబైతో పాటు గోవా లోనావాలా వంటి ప్రాంతాలలో కూడా విలువైన ప్రాపర్టీలు, విల్లాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఖరీదైన కార్లంటే మక్కువ ఉన్న ఇమ్రాన్ హష్మీ గ్యారేజ్‌లో పలు హై-ఎండ్ లగ్జరీ వాహనాలు ఉన్నాయి. లాంబోర్ఘిని హురాకాన్, రేంజ్ రోవర్ వోగ్, ఆడి ఎ8 ఎల్ , మెర్సిడెస్ మేబ్యాక్ వంటి కోట్ల విలువైన విలాసవంతమైన కార్లు ఆయన వద్ద ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. తన అభిరుచికి తగినట్లుగా కార్లను ఎంచుకుంటూ హష్మీ రాయల్ లైఫ్‌స్టైల్‌ను లీడ్ చేస్తున్నారు.
ఇక ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే హష్మీ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకత సాధించిన కల్ట్ క్లాసిక్ మూవీ `ఆవారాపన్` కు సీక్వెల్‌గా వస్తోన్న `ఆవార్పన్ 2` చిత్రంలో మళ్లీ శివమ్ పండిట్ పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నారు. నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో హష్మీక్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఇమ్రాన్ హష్మీ చాక్లెట్ బాయ్ థ్రిల్లర్ హీరో ఇమేజ్‌కే పరిమితం కాలేదు. విజయవంతమైన వ్యాపారవేత్తలా ఆస్తులను వృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నటనపై నిరంతర అంకితభావం చూపుతూనే ఆర్థిక పరమైన వ్యూహాలతో ఆయన నిర్మించుకున్న 105 కోట్ల సామ్రాజ్యం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
