సీరియల్ కిస్సర్ తో దిశాపటానీ ఇంటిమేట్ సీన్స్!
బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీతో సినిమా అంటే ఘాడమైన లిప్ లాక్ లు తప్పనిపరి. హీరో-హీరోయిన్ పెదవులు జుర్రుకోవడం సినిమా కే హైలైట్ గా నిలుస్తుంది.
By: Srikanth Kontham | 4 March 2026 9:53 AM ISTబాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీతో సినిమా అంటే ఘాడమైన లిప్ లాక్ లు తప్పనిపరి. హీరో-హీరోయిన్ పెదవులు జుర్రుకోవడం సినిమా కే హైలైట్ గా నిలుస్తుంది. ఆ విషయంలో సీరియల్ కిస్సర్ ని కొట్టే మొనగాడే లేడు. ఇమ్రాన్ హష్మీ సుదీర్ఘ కెరీర్‌లో అనేక మంది హీరోయిన్లతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. హష్మీ రెండు దశాబ్దాల ప్రయాణంలో దాదాపు 15 ఏళ్ల పాటు ముద్దు సన్నివేశాల్లో నలిగిపోయాడు. 17-20 ఏళ్ల వయసులోనే హీరోయిన్లతో ముద్దు సన్నివేశాలు నటించడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి దాదాపు 2019 వరకూ కొనసాగించాడు.
ఇలా ముద్దు సన్నివేశాల్లో నటించి చివరికి తన పెదవులు కూడా వాచిపోయేవని చమత్కరించిన సందర్భాలు అనేకం. మీరు ముద్దులు పెట్టిన హీరోయిన్లు ఎంత మంది ఉంటారంటే? సుమార్ 25 నుంచి 30 వరకూ ఉండొచ్చని ఓ అంచనగా కూడా చెప్పాడు. అయితే గత కొన్ని ఏళ్లుగా ఇమ్రాన్ హష్మీ తన ఇమేజ్‌ను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. `టైగర్ 3` వంటి సినిమాల్లో విలన్‌గా మెప్పించి, ఇప్పుడు కంటెంట్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. 2019లో ఒక ఈవెంట్‌లో తను ఇప్పుడు రిటైర్డ్ కిస్సర్ అని కూడా ప్రకటించాడు.
ముద్దు సన్నివేశాల వల్ల తన భార్య పర్వీన్ షహాని మొదట్లో అసహనానికి గురయ్యేదని, ప్రతి కిస్సింగ్ సీన్‌కు బదులుగా ఆమెకు ఒక ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ కొనిచ్చి ఒప్పించేవాడినని ఇమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. అయితే 2019 నుంచి పెదవి ముద్దలకు దూరంగా ఉంటున్నాడు. రకరకాల పాత్రల్లో తెరపై కనిపిస్తున్నాడు. తాజాగా ఓ సినిమా కోసం మళ్లీ తనలోని సీరియల్ కిస్సర్ ని తట్టి లేపుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి.
ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ హీరోగా `అవారపన్ `కు సీక్వెల్ గా `అవారపన్ 2` ని నితిన్ కక్కర్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా దిశా పటానీ నటిస్తోంది.
అయితే ఈసినిమాలో కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు కూడా ఉన్నాయని వార్తలొస్తున్నాయి. హీరో-హీరోయిన్ మధ్య సన్నిహిత సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. అయితే వాటిలో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయా? లేదా? అన్నది క్లారిటీ లేదు. ఆరేళ్లగా ఇమ్రాన్ హష్మీ నో కిస్ పాలసీ పాటిస్తున్నాడు కాబట్టి? లిప్ లాక్ లేకుండా ఇంటిమేట్ సన్నివేశాలు డిజైన్ చేసారా? లేక పాలసీని పక్కన బెట్టాడా? అన్నది క్లారిటీ లేదు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తున్న తరుణంలో ఈ విషయం లీక్ అవ్వడం సినిమాకు మంచి బజ్ ను తీసుకొస్తుంది. గ్లామర్ డాల్ దిశాపటానీ సైతం గ్లామర్ పాత్రలకు..ఇంటిమేట్ సన్నివేశాలకు నో చెప్పే నటి కాదు. ఆ విషయంలో పూర్తిగా దర్శకుల హీరోయిన్ గా పనిచేస్తుంది.
