హేషమ్ మ్యాజిక్.. ప్రేమకథలకు మరోసారి మ్యూజికల్ టచ్
లవ్ స్టోరీలకు మ్యూజిక్ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన బలం. మంచి ట్యూన్ ఉంటే కథ ప్రేక్షకుల ముందుకు రాకముందే ఆ సినిమాపై ఓ స్పెషల్ ఫీల్ ఏర్పడుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 29 Sept 2026 12:17 PM ISTలవ్ స్టోరీలకు మ్యూజిక్ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన బలం. మంచి ట్యూన్ ఉంటే కథ ప్రేక్షకుల ముందుకు రాకముందే ఆ సినిమాపై ఓ స్పెషల్ ఫీల్ ఏర్పడుతుంది. ఇప్పుడు మేక రోషన్, ప్రీతి ముకుందన్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏమో ఏమో ఇది సినిమా కూడా అదే మార్గంలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేయగా.. తాజాగా రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ సినిమాపై మరో రకమైన ఆసక్తిని తీసుకొచ్చింది. ఏమో ఏమో ఇది టైటిల్ సాంగ్‌కు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం ఈ సాంగ్ కు మెయిన్ ఎట్రాక్షన్ గా మారింది. ప్రేమకథలకు తన మ్యూజిక్ తో ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించడంలో గుర్తింపు తెచ్చుకున్న హేషమ్.. ఈసారి కూడా కథను ముందే చెప్పకుండా మ్యూజిక్ ద్వారా ఆడియన్స్ కు ఓ లవ్ ఫీల్‌ను పరిచయం చేసే ప్రయత్నం చేసినట్లు పాటను వింటే అనిపిస్తోంది.
ఇక సాంగ్ ను కార్తీక్, రమ్య బెహరా ఆలపించిన విధానం, కేకే అందించిన సాహిత్యం ఈ ట్యూన్‌కు మరింత మెలోడీని జోడించాయి. ముఖ్యంగా సాంగ్ ను మొదటిసారి విన్న వెంటనే గుర్తుండిపోయేలా క్యాచీగా కంపోజ్ చేయడం.. రిపీట్ లిజనింగ్‌కు అనుకూలంగా నిలిచేలా చేసింది. అయితే ఈ సాంగ్ ను కేవలం మ్యూజిక్ రిలీజ్‌గా చూడటం కంటే.. సినిమా ప్రమోషన్‌లో వేసిన ఓ కీలకమైన అడుగుగా చూడొచ్చు. మేకర్స్ దీనిని Breezy Love Anthem of the Season గా పరిచయం చేయడం వెనుక కూడా అదే ఉద్దేశం కనిపిస్తోంది.
సినిమా కథ, పాత్రల గురించి ఎక్కువగా వివరించకుండానే.. ఒక సాంగ్ తోనే లవ్ స్టోరీ వాతావరణాన్ని ఆడియన్స్ కు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ను ఎట్రాక్ట్ చేసే బ్రీజీ మెలోడీ, హీరో- హీరోయిన్ జంటకు సంబంధించిన క్యూరియాసిటీ, రొమాంటిక్ ఫీల్.. ఇవన్నీ కలిపి థియేటర్లలో సినిమా చూడాలనే ఆసక్తికి పునాది వేయొచ్చు. అంటే కథ ఇంకా పూర్తిగా ప్రేక్షకుల ముందుకు రాకముందే.. మ్యూజిక్ ద్వారా ఏమో ఏమో ఇది తన లవ్ వరల్డ్‌కు ఆహ్వానం పలుకుతోంది. ఇప్పుడు ఈ టైటిల్ సాంగ్ ఎంతగా ఆడియన్స్ ప్లేలిస్టుల్లో స్థానం సంపాదిస్తుందనేదే ఆసక్తికరంగా మారింది.
