బిగ్ బాస్ 9.. సేఫ్ గేమ్ ముసుగులో ఆ కంటెస్టెంట్..?
ఇమ్మాన్యుయెల్ ఇప్పటివరకు బాగానే ఆడుతూ వస్తున్నా కామెడీ చేయాల్స్తూ సడెన్ గా అతని ఆట సీరియస్ మోడ్ లోకి వెళ్లడం ఆడియన్స్ కి కాస్త డిజప్పాయింట్ గానే ఉంది.
By: Ramesh Boddu | 22 Oct 2025 12:25 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఎవరి ఆట వాళ్లు ఆడుతున్నారు. ఎవరికి వాళ్లు వారు చేస్తుంది కరెక్ట్ మిగతా వాళ్లు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు అని ఉంటుంది. కానీ హౌస్ లో ఉన్న వాళ్ల అందరి ఆట చూస్తూ ఆడియన్స్ లో ఒక కచ్చితంగైన ఒపీనియన్ ఉంటుంది. అందులో ఎవరి సేఫ్ ఆడుతున్నారు.. ఎవరు ముసుగుతో ఉన్నారు కనిపెట్టేస్తారు. ఈ క్రమంలో సీజన్ 9లో ఇప్పటివరకు టాప్ ప్లేయర్ గా ఉంటూ ప్రతి ఒక్కరి దగ్గర మంచోడని అనిపించుకుంటున్న ఇమ్మాన్యుయెల్ కూడా సేఫ్ గేం ఆడుతున్నాడని అర్థమవుతుంది.
తనూజ ఇమ్మాన్యుయెల్ కామెడీ..
ఎందుకంటే తను చేసే సాఫ్ట్ టార్గెట్ కూడా తనకు దగ్గరగా వచ్చిన వారే అవుతున్నారు. ముఖ్యంగా తనూజ విషయంలో ఇమ్మాన్యుయెల్ కాల్ ఏదైతే ఉందో అది చాలా డౌట్లు తెస్తుంది. ఎందుకంటే తనూజ ఇమ్మాన్యుయెల్ ఈ ఆరేడు వారాల్లో కలిసి కామెడీ చేశారు. తనూజని ఫ్లర్ట్ చేస్తూ ఇమ్మాన్యుయెల్ ముందు వారాల్లో ఎంటర్టైన్మెంట్ కూడా చేశాడు. కానీ తనతో ఈక్వెల్ క్రేజ్ బయట సంపాదిస్తుంది అన్న ఆలోచనతో ఇప్పుడు ఇమ్మాన్యుయెల్ ఫస్ట్ టార్గెట్ తనూజ అయ్యింది.
ఈ వీక్ నామినేషన్స్ లో కూడా తనూజని నామినేట్ చేస్తాడనే కళ్యాణ్ కి నామినేషన్ టోకెన్ ఇచ్చాడు. తనూజ ఆ విషయం అడిగితే రమ్యతో మీకున్న ఇష్యూస్ మీరు తేల్చుకోండని అన్నాడు. అంటే మీరు మీరు గొడవ పడండి నేను చూస్తూ ఉంటానని ఇమ్మాన్యుయెల్ వెర్షన్ అన్నమాట. అదీగాక వైల్డ్ కార్డ్స్ వచ్చి రెండో వారమే కానీ తనూజ మొదటి వారం నుంచి ఉంది. సో రమ్య, తనూజ ఇద్దరు ఇమ్మాన్యుయెల్ విషయంలో ఒకేలా ఎలా అవుతారన్నది ఆడియన్స్ కామెంట్.
ఆట సీరియస్ మోడ్ లో ఇమ్మాన్యుయెల్..
మరి ఇమ్మాన్యుయెల్ ఇలానే తన ఆట కొనసాగిస్తాడా లేదా జస్ట్ తన ఆట మార్చుకునేందుకే ఇలా చేస్తాడా అన్నది చూడాలి. ఇమ్మాన్యుయెల్ ఇప్పటివరకు బాగానే ఆడుతూ వస్తున్నా కామెడీ చేయాల్స్తూ సడెన్ గా అతని ఆట సీరియస్ మోడ్ లోకి వెళ్లడం ఆడియన్స్ కి కాస్త డిజప్పాయింట్ గానే ఉంది. అదీగాక పవర్ అస్త్ర వచ్చింది కాబట్టే ఇక తాను టాప్ 5 పక్కా అని ఫిక్స్ అయ్యాడు కాబట్టే ఇమ్మాన్యుయెల్ లో ఈ మార్పు వచ్చిందని అనుకుంటున్నారు. మరి రాబోతున్న వారాల్లో ఇమ్మాన్యుయెల్ ఈ ఒపీనియన్ మార్చుకుంటాడా లేదా అలానే కొనసాగుతాడా అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్స్ వచ్చాక హౌస్ అట్మాస్పియర్ మారిపోయింది. ఐతే ఇప్పుడు టాప్ 5లో ఎవరు ఉంటారు.. ఎవరి ఆట మార్చుకుంటారన్నది డిస్కషన్స్ జరుగుతున్నాయి.
