బాలీవుడ్ భామలు కాపీ కొట్టే లుక్కు ఇది
ది లేట్ షో విత్ స్టీఫెన్ కోల్బర్ట్ కోసం న్యూయార్క్ నగరంలో ఎమ్మా ఇలా ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. డోనా కరణ్ స్ప్రింగ్ సమ్మర్ 1996 కలెక్షన్ నుండి వచ్చిన ప్రత్యేకమైన శాటిన్ ఫ్రాక్ ఇది.
By: Sivaji Kontham | 27 Oct 2025 12:00 AM ISTకళ్లు చెదిరేలా.. గుండె గుల్ల చేసేలా.. ఏదో ఒక మాయ చేయాలి! అలాంటి మాయా మంత్రం వేయడంలో ఇప్పుడు హాలీవుడ్ కథానాయికలే కాదు టాలీవుడ్ కథానాయికలు ఆరితేరిపోయారు. అయినా ఇప్పటికీ హాలీవుడ్ క్లాసిక్ భామల నాటి మేటి లుక్కులు ప్రజాకర్షణను కలిగి ఉన్నాయి. అలాంటి ఒక లుక్కుతో ప్రఖ్యాత హాలీవుడ్ నటి, ఆస్కార్ గ్రహీత ఎమ్మా స్టోన్ హొయలు పోయిన తీరు చర్చగా మారింది.
హృదయాలను కొల్లగొట్టే కల్ట్ స్టాటస్ తో అందమైన పచ్చని శాటిన్ గౌన్.. బటన్ లెస్ గా ధరిస్తే అరవిరిసిన అందాలు ఎంతగా కవ్విస్తాయో ఎమ్మా లేటెస్ట్ స్టిల్ చెబుతోంది. ది లేట్ షో విత్ స్టీఫెన్ కోల్బర్ట్ కోసం న్యూయార్క్ నగరంలో ఎమ్మా ఇలా ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. డోనా కరణ్ స్ప్రింగ్ సమ్మర్ 1996 కలెక్షన్ నుండి వచ్చిన ప్రత్యేకమైన శాటిన్ ఫ్రాక్ ఇది. మెరిసే ఆకుపచ్చ సిల్క్ బ్లౌజ్ మ్యాచింగ్ స్లిప్ స్కర్ట్.. అసలు ఈ డిజైన్‌కి ఎవరు స్ఫూర్తి? అని ప్రశ్నిస్తే.. అది కచ్ఛితంగా పాపులర్ నటి గ్వినేత్ పాల్ట్రో ఆన్ స్క్రీన్ శైలికి నివాళి. అల్ఫోన్సో క్యూరాన్ క్లాసిక్ మూవీ `గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్`లో ఎస్టెల్లాగా గ్వినేత్ ధరించిన లుక్ చాలా కాలం పాటు పాప్ కల్చర్‌లో స్థిరంగా వేవ్స్ క్రియేట్ చేసింది.
ఇది సినిమాటిక్ ఎక్స్ ప్రెషన్.. సినిమాటిక్ ఫ్యాషన్ సెన్స్.. 19వ శతాబ్దపు కార్సెట్ గౌన్లు ఈరోజుల్లో చూడలేం. వాటి స్థానంలో వెరైటీ అల్లికలతో దుస్తులు చాలా రూపాంతరం చెందాయి. కానీ దానికి మించి ప్లెయిన్ శాటిన్ గౌన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రెండు దశాబ్ధాలుగా ఈ లుక్ ఫ్యాషన్ ప్రపంచంలో వేవ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. తన లేటెస్ట్ మూవీ `బుగోనియా`ను ప్రమోట్ చేస్తున్న ఎమ్మా స్టోన్ ఇలా క్లాసిక్ డే కల్ట్ లుక్ తో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ లో ఆలియా, దీపిక, కత్రిన, తమన్నా లాంటి స్టార్లు ఈ క్లాసిక్ డే లుక్ ని కాపీ కొట్టి చాలాసార్లు దర్శనమిచ్చారు. అందుకే ఇది ఎంతో ప్రత్యేకమైనది.
