Begin typing your search above and press return to search.

స్వీడిష్ - గ్రీక్ సుంద‌రి తంబీల్ని వ‌దిలేట్టు లేదు!

సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్లతో ఆకట్టుకుంటున్న స్వీడిష్ బ్యూటీ ఎల్లీ అవ్రామ్ మళ్లీ కోలీవుడ్‌పై దృష్టి పెట్టింది. గతంలో ధనుష్ నటించిన ‘నానే వరువేన్’, ‘ప్యారిస్ ప్యారిస్’ సినిమాలతో తమిళ ప్రేక్షకులను పలకరించిన ఈ భామ.. మరో తమిళ చిత్రంతో రీఎంట్రీకి సిద్ధమవుతోంది. మరి ఈ ప్రయత్నమైనా ఆమెకు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెస్తుందేమో చూడాలి.

By:  Sivaji Kontham   |   16 Nov 2026 2:23 AM IST
స్వీడిష్ - గ్రీక్ సుంద‌రి తంబీల్ని వ‌దిలేట్టు లేదు!
X

బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమైన స్వీడిష్-గ్రీక్ సుందరి ఎల్లీ అవ్‌రామ్ కొన్నేళ్ల క్రితం యువ‌క్రికెట‌ర్ హార్థిక్ తో ఎఫైర్ కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. అత‌డు స‌డెన్ గా న‌టాషా స్టాంకోవిక్ ని పెళ్లాడి త‌న‌కు దూర‌మైపోయాడు. ఆ త‌ర్వాత ఈ బ్యూటీ పూర్తిగా సినిమా కెరీర్ పైనే దృష్టి సారించింది. తనదైన‌ అందంతో క‌వ్విస్తూనే సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే ఈ స్వీడిష్ బ్యూటీ ఇన్‌స్టాలో నిరంత‌రం వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

సోష‌ల్ మీడియాలో ఒకవైపు సంప్రదాయబద్ధమైన చీరకట్టులో హుందాగా కనిపిస్తూనే.. మరోవైపు హాట్ బికినీ ఫొటోలు, రీల్స్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా ఎల్లీ షేర్ చేసిన గ్లామరస్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. సినిమాల విషయంలోనూ ఈ అమ్మడు మళ్లీ సౌత్ ఇండస్ట్రీపైనే గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా కోలీవుడ్ అంటే ఎల్లీ అవ్‌రామ్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో ధనుష్ నటించిన `నానే వరువేన్` చిత్రంతో పాటు `ప్యారిస్ ప్యారిస్` వంటి సినిమాలతో తమిళ ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. తాజాగా మరో ఆసక్తికరమైన తమిళ చిత్రంతో కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. దక్షిణాదిలో తనకు మంచి గుర్తింపునిచ్చిన తమిళ ఇండస్ట్రీని వదిలిపెట్టే ఉద్దేశం లేదని.. ఇక్కడ మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.

అయితే ఆకట్టుకునే అందం..అద్భుతమైన డ్యాన్సింగ్ ట్యాలెంట్‌.. నటనపై మంచి పట్టు ఉన్నా ఎల్లీ అవ్‌రామ్ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎందుకు ఎదగలేకపోయిందన్నది సినీ వర్గాల్లో ఎప్పుడూ చర్చనీయాంశమే. కెరీర్ ఆరంభంలో మిక్కీ వైరస్, కిస్ కిస్కో ప్యార్ కరూన్ వంటి చిత్రాలతో పాటు `బిగ్ బాస్-హిందీ` షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత సరైన కథల ఎంపికలో తడబడింది. ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లేదా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కావడం.. కమర్షియల్‌గా భారీ విజయాలు దక్కకపోవడం అవ్ రామ్ కెరీర్ గ్రాఫ్‌ను వెనక్కి గుంజాయని విశ్లేషకులు భావిస్తుంటారు.

దీనికి తోడు భాషాపరమైన అడ్డంకులు.. వరుస సినిమాలు లేకపోవడం కూడా స్వీడిష్ బ్యూటీ స్టార్‌డమ్‌కు అడ్డుకట్ట వేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో క్రేజ్ కొనసాగిస్తున్న ఎల్లీ అవ్‌రామ్.. కేవలం గ్లామర్ డాళ్‌గానే కాకుండా నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ తాజా తమిళ రీఎంట్రీ అయినా ఈ అందాల భామకు కోరుకున్న బ్రేక్ ఇచ్చి స్టార్ లీగ్‌లోకి తీసుకెళ్తుందో లేదో చూడాలి.