మాలీవుడ్ 'ఎకో'.. మరోసారి ప్రూవ్ చేసిందిగా!
కంటెంట్ ఉంటే క్యాస్టింగ్ తో ఎలాంటి సంబంధం లేదని ఆ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.
By: M Prashanth | 25 Nov 2025 12:00 AM ISTమాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ఎప్పటికప్పుడు అక్కడ రూపొందే చిత్రాలు సంచలనం సృష్టిస్తుంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కి అందరినీ ఆకట్టుకుంటాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతాయి. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా దాదాపు అన్ని ఇండస్ట్రీల మూవీ లవర్స్ కు నచ్చుతాయి. దీంతో మలయాళం సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.
అంతేకాదు.. ఎప్పటికప్పుడు మాలీవుడ్ సినిమాల చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మూవీ ఎకో గురించి తెగ డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే.. హిట్ అవ్వడానికి.. కంటెంట్ ఉంటే క్యాస్టింగ్ తో ఎలాంటి సంబంధం లేదని ఆ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. కొత్త తారాగణంతో రూపొందిన ఆ మూవీ.. అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది.
మంచి మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎకో సినిమాకు దింజిథ్ అయ్యథాన్ దర్శకత్వం వహించారు. సందీప్ ప్రదీప్, వినీత్, బిను పప్పు, బైనా లీడ్ రోల్స్ లో నటించిన ఆ సినిమా.. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకుని సందడి చేస్తోంది. సూపర్ ఎక్స్ పీరియన్స్ ను మూవీ ఇచ్చిందని అంతా కొనియాడుతున్నారు.
అయితే దింజిథ్ అయ్యథాన్.. తన ఫస్ట్ మూవీతో అందరినీ ఆకట్టుకున్నారు. 2019లో అమ్మినిప్పిల్లా మూవీ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత గత ఏడాది కిష్కింద కాండం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అటు థియేటర్స్.. ఇటు ఓటీటీలో ఆ మూవీ.. ఫుల్ గా అలరించింది. ఇప్పుడు ఎకో కూడా మంచి టాక్ తో సందడి చేస్తోంది.
అదే సమయంలో ఎకో మూవీ.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాతో పోటీ పడి పై చేయి సాధించిందనే చెప్పాలి. ఇప్పటికే వివిధ సినిమాలతో స్టార్ హోదా దక్కించుకున్న పృథ్వీరాజ్ నటించిన లేటెస్ట్ మూవీ విలాయత్ బుద్ధా కూడా ఇటీవల రిలీజ్ అయింది. కానీ ఆ సినిమా అనుకున్నట్లు రెస్పాన్స్ సంపాదించుకోలేకపోయింది.
కానీ ఎకో మాత్రం.. ఆడియన్స్ ను మెప్పిస్తోంది. స్ట్రాంగ్ రివ్యూస్, పాజిటివ్ మౌత్ టాక్ తో సందడి చేస్తున్న సినిమా అన్ని విధాలుగా పెర్ఫెక్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. స్టోరీ, టేకింగ్, మేకింగ్ సహా అన్ని విభాగాల్లో అదిరిపోయిందని అంటున్నారు. మిస్టరీ థ్రిల్లర్ అంటే అలా ఉండాలని చెబుతున్నారు. ఇప్పటికే మాలీవుడ్ హిట్ మూవీస్ తెలుగులోకి రాగా.. ఎకో కూడా డబ్ అవుతుందేమో చూడాలి.
