Begin typing your search above and press return to search.

'ఎకో' సోషల్ మీడియా సౌండ్ బాగుందిగా..?

మలయాళంలో రిలీజైన ప్రతి సినిమాపై సినీ ప్రియుల స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ముఖ్యంగా అక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

By:  Ramesh Boddu   |   22 Nov 2025 3:41 PM IST
ఎకో సోషల్ మీడియా సౌండ్ బాగుందిగా..?
X

మలయాళంలో రిలీజైన ప్రతి సినిమాపై సినీ ప్రియుల స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ముఖ్యంగా అక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా మలయాళ సినిమాలను మెజారిటీ సినీ లవర్స్ ఇష్టపడతారు. అందుకే ఆ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. మలయాళంలో ఒక సినిమా బాగుంది అంటే సోషల్ మీడియాలో ఆ మూవీపై స్పెషల్ డిస్కషన్ జరుగుతుంది. లేటెస్ట్ గా ఎకో అనే సినిమా గురించి సోషల్ మీడియాలో సౌండ్ వినపడుతుంది.

ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్ పీరియన్స్..

దింజిథ్ అయ్యథాన్ డైరెక్ట్ చేసిన ఎకో సినిమాలో సందీప్ ప్రదీప్, వినీత్, బిను పప్పు, బైనా నటించారు. మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన సినిమా ఇదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాతో పాటే పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన విలాయత్ బుద్ధ రిలీజైంది. సినిమాలో అతనొక స్మగ్లర్ గా నటించాడు. ఐతే ఈ సినిమా ట్రైలర్ చూసి చాలామంది పుష్పతో పోలుస్తూ కామెంట్ చేశారు. ఇక నిన్న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. ఐతే పోటీగా రిలీజైన ఎకో మాత్రం అంతటా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.

విలాయత్ బుద్ధా మిస్ ఫైర్..

పృథ్వీరాజ్ సినిమాతో పోటీ పడి మరీ ఆయన మీద విజయం సాధించారు ఎకో మూవీ టీం. ఐతే కొన్నిసార్లు చిన్న సినిమాలు కూడా స్టార్ సినిమాల మీద సత్తా చాటుతుంటాయి. పృథ్వీరాజ్ చేసిన విలాయత్ బుద్ధా ప్రయత్నం మిస్ ఫైర్ అయినట్టే అని తెలుస్తుంది. మలయాళంతో పాటు తెలుగులో కూడా క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పటికే ప్రభాస్ సలార్ లో వరద రాజ మన్నార్ రోల్ లో మెప్పించిన ఆయన నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ వారణాసిలో కుంభ రోల్ లో అదరగొట్టబోతున్నారు.

ఎకో డైరెక్టర్ దింజిత్ అయ్యథాన్ తన ఫస్ట్ సినిమా అమ్మినిప్పిల్లా తో ఇంప్రెస్ చేశాడు. 2019లో ఫస్ట్ సినిమా చేసిన ఈ డైరెక్టర్ లాస్ట్ ఇయర్ కిష్కింద కాండం తో సూప హిట్ అందుకున్నాడు. థ్రిల్లర్ సినిమాలతో అతని స్త్రెంత్ చూపిస్తున్న దింజిథ్ లేటెస్ట్ గా ఎకో సినిమాతో కూడా తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా పృధ్వీరాజ్ సినిమాతో రిలీజ్ చేసి యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం అంటే ప్రశంసించాల్సిన విషయమే.