సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ… ఏక్ దిన్ తో మ్యాజిక్ చేస్తుందా?
తాజాగా ఏక్ దిన్ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ ను చూస్తే ఇదొక ట్రాజెడీ లవ్ స్టోరీ అని అర్థమవుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 16 April 2026 5:40 PM ISTబాలీవుడ్‌లోకి సౌత్ స్టార్ ఎంట్రీలు ఎప్పుడూ ప్రత్యేక చర్చకు దారితీస్తాయి. ఇప్పుడదే ట్రెండ్‌లో సాయి పల్లవి ఏక్ దిన్ మూవీతో అడుగుపెడుతోంది. తన నేచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ గుండెల్లో స్థానం సంపాదించుకున్న సాయి పల్లవి, నార్త్ మార్కెట్‌లో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అన్న ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు, జునైద్ ఖాన్.., అమీర్ ఖాన్ వారసుడిగా తన తొలి ఇంప్రెషన్ ఎలా ఉంటుందో కూడా ఈ సినిమాపై దృష్టిని మరింత పెంచుతోంది.
తాజాగా ఏక్ దిన్ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ ను చూస్తే ఇదొక ట్రాజెడీ లవ్ స్టోరీ అని అర్థమవుతుంది. జునైద్ ఒక ఇంట్రోవర్ట్ టెక్ గీక్‌గా కనిపిస్తూ, సైలెంట్ లవ్ స్టోరీని మోసే రోల్ లో ఇంప్రెస్ చేసేలానే ఉన్నాడు. ఈ కాంబినేషన్‌లోనే సినిమా ప్రత్యేకత దాగి ఉందని చెప్పాలి. ఈ సినిమాకు ప్రధాన బలం కేవలం లవ్ స్టోరీ కాదు, దాని బ్యాక్‌డ్రాప్. ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా లాంటి అరుదైన వ్యాధి చుట్టూ తిరిగే కథ, ఎమోషనల్ డెప్త్‌ను పెంచే ప్రయత్నంగా కనిపిస్తోంది.
ఒక రోజు జరిగిన విషయాలను పూర్తిగా మరిచిపోయే హీరోయిన్, ఆమెను ప్రేమించే హీరో.. ఇందులో హీరో పాత్రలో ఉన్న త్యాగం, సహనం, అన్‌కండిషనల్ లవ్‌ను ప్రతిబింబించే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక కునాల్ కపూర్ తో సాయి పల్లవి లవ్ ట్రాక్ కథ కాన్ఫ్లిక్స్ ను పెంచేలా ఉంది. ట్రైలర్ చూస్తుంటే బాలీవుడ్‌లో రీసెంట్ గా తగ్గిపోయిన ప్యూర్ రొమాంటిక్ డ్రామాల లోటును ఈ సినిమా భర్తీ చేసేలానే అనిపిస్తోంది.
సాయి పల్లవి గతంలోనే ఈ తరహా పాత్రలు రెండు సినిమాల్లో చేసింది. వాటిలో ఒకటి ప్రేమమ్ కాగా, రెండోది పడి పడి లేచే మనసు. మెమరీ లాస్‌తో బాధపడే పాత్రలో ఎమోషన్స్ ను ఎంతో బాగా చూపించి ఆ సినిమాలను తన యాక్టింగ్ తో నిలబెట్టింది పల్లవి. ఇప్పుడు ఏక్ దిన్ మూవీలో కూడా సాయి పల్లవి మరోసారి తన యాక్టింగ్ తో అదరగొట్టనుందని అర్థమవుతుంది. ట్రైలర్‌లో కనిపించిన కొన్ని ఎమోషనల్ మోమెంట్స్ ఆమె మరోసారి హార్ట్ టచ్ చేసే పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందనే సంకేతాలు ఇస్తున్నాయి. మే 1న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనేది రిలీజ్ తర్వాతే తెలియనుంది. మొత్తానికి, ఏక్ దిన్ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీగా మాత్రమే కాకుండా, సాయి పల్లవి నటనను మరోసారి కొత్త స్థాయిలో చూపించే అవకాశంగా నిలుస్తోంది.
