టీజర్: హర్షవర్ధన్ రాణే మరో ఎమోషనల్ లవ్ స్టోరి
స్వచ్ఛమైన ప్రేమికుల కథను ఎంచుకుని, నవతరం నటీనటులతో మోహిత్ సూరి తెరకెక్కించిన `సయ్యారా` బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన మ్యాజిక్ చేసింది.
By: Sivaji Kontham | 23 Aug 2025 1:50 PM ISTస్వచ్ఛమైన ప్రేమికుల కథను ఎంచుకుని, నవతరం నటీనటులతో మోహిత్ సూరి తెరకెక్కించిన `సయ్యారా` బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన మ్యాజిక్ చేసింది. ఈ సినిమాలో లవ్, రొమాన్స్‌తో పాటు, ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడం బాక్సాఫీస్ విజయానికి దోహదపడిందని క్రిటిక్స్ విశ్లేషించారు. ఇటీవలి కాలంలో మౌత్ టాక్ తో పెద్ద విజయం అందుకున్న సినిమాల్లో ఇది ఒకటి.
అయితే మరోసారి ఎమోషనల్ రైడ్ ఉన్న ప్రేమకథా చిత్రంతో బాలీవుడ్ లో అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేసేందుకు వస్తోంది-ఏక్ దీవానే కి దీవానియాత్. `సనమ్ తేరి కసమ్` చిత్రం రెండో రిలీజ్ తో పెద్ద విజయం అందుకున్న హర్షవర్దన్ రాణే ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించగా, సోనమ్ బజ్వా కథానాయికగా నటించింది. ఈ జంట నడుమ ప్రేమకథను తెరపై ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమయ్యారని తాజాగా విడుదలైన టీజర్ వెల్లడించింది.
ప్రేమ, విరహం, బాధ, ఉద్వేగం ప్రతిదీ టీజర్ లో హైలైట్ గా కనిపించాయి. ప్రేమ కోసం మరణాన్ని అయినా ఎదురించే వీర ప్రేమకుడిగా హర్షవర్ధన్ రాణే జీవించాడు. ప్రస్తుతానికి టీజర్ యువతరానికి కనెక్టయింది. అయితే ఈ టీజర్‌లో చూపించినంత ఎమోషన్ తెర నిండా ప్రతి ఫ్రేమ్‌లో వర్కవుటైతే గనుక ఈ సినిమా మరో గ్రాండ్ సక్సెస్ ని సాధించేందుకు ఆస్కారం ఉంది. చాలా మంది `సనమ్ తేరి కసమ్` తరహాలో హర్షవర్ధన్ మరోసారి మ్యాజిక్ చేస్తాడని నమ్ముతుంటే, ఈసారి వేచి చూడాలి అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ టీజర్ లో వినిపించిన బీజీఎం, థీమ్ మ్యూజిక్ సహా పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇది మరో ఎమోషనల్ లవ్ స్టోరి అంటూ చాలా మంది అభివర్ణిస్తున్నారు. మంచి సంగీతం ఈ సినిమాకి అదనపు బలం. అక్టోబర్ 21న దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదలవుతుంది. దీపావళి వారాంతాన్ని ఈ ప్రేమకథా చిత్రం ఎన్ క్యాష్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సోను నిగమ్, శ్రేయ ఘోషల్, అరిజిత్ సింగ్, జుబిన్ నౌటియల్, విశాల్ మిశ్రా, బి ప్రాక్, నేహా కక్కర్ వంటి టాప్ గాయనీగాయకులు, సంగీతజ్ఞులు ఈ చిత్రం కోసం పని చేస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంచి ప్రేమకథకు సంగీతం అత్యంత కీలకం. ఆ విషయంలో హర్షవర్ధన్ టీమ్ తీసుకున్న జాగ్రత్తలు ప్రధాన బలంగా పని చేస్తున్నాయి.
