Begin typing your search above and press return to search.

'ఆ ప్రొడ్యూసర్ జూమ్ చేసి అలా అనేశారు'.. ఈషా ఎమోషనల్!

హీరోయిన్ ఈషా రెబ్బా తన కెరీర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ ఎక్స్పీరియన్స్ ను తలుచుకుని కాస్త ఎమోషనల్ అయ్యారు.

By:  M Prashanth   |   24 Jan 2026 6:52 PM IST
ఆ ప్రొడ్యూసర్ జూమ్ చేసి అలా అనేశారు.. ఈషా ఎమోషనల్!
X

హీరోయిన్ ఈషా రెబ్బా తన కెరీర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ ఎక్స్పీరియన్స్ ను తలుచుకుని కాస్త ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతి జనవరి 23వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండటంతో ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె గతంలో తనకు ఎదురైన ఒక చేదు సంఘటనను ప్రేక్షకులతో పంచుకున్నారు.

సినిమాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన రోజుల్లో ఒక నిర్మాత తన ఫోటోలను ల్యాప్‌ టాప్‌ లో జూమ్ చేసి చూసి, 'నీ మోచేయిలు డార్క్‌ గా ఉన్నాయి.. ఇంకా ఫెయిర్‌ గా ఉండాలి' అంటూ తన ముందే వ్యాఖ్యానించారని ఈషా రెబ్బా తెలిపారు. ఆ మాటలు తన మనసును చాలా బాధించాయని, దాని వల్ల కొంతకాలం వరకు తీవ్రంగా నిరుత్సాహానికి లోనయ్యానని చెప్పారు.

ఆ సమయంలో ఆ వ్యక్తికి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియక మౌనంగా ఉండిపోయానని గుర్తు చేసుకున్నారు. అయితే తన పుట్టుకతో వచ్చిన రంగును మార్చుకోలేనని, అయినా అప్పట్లో ఆ వ్యాఖ్యలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయని ఈషా పేర్కొన్నారు. అప్పుడు పరిశ్రమలో ఇలాంటి విషయాలు సాధారణమేనని కూడా తనకు తెలియదని చెప్పారు.

అందుకే చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పిన ఈషా.. ఆ తర్వాత తనను తాను అంగీకరించడం నేర్చుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆ విషయాన్ని పాజిటివ్‌ గా తీసుకుంటున్నానని అన్నారు. అదే సమయంలో ఆ అనుభవమే తనను మరింత బలంగా మార్చిందని, ఇప్పుడు తన రూపాన్ని, తనను తాను గౌరవించుకోవడం తెలుసుకున్నానని ఈషా రెబ్బా చెప్పుకొచ్చారు.

అయితే ఇలాంటి వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చాలా మంది నటీనటులు ఎదుర్కొంటున్నారని, అయితే వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఈషా సూచించారు. తన అనుభవాన్ని షేర్ చేయడం ద్వారా ఇతరులకు ధైర్యం కలగాలని ఆశిస్తున్నానని కూడా చెప్పారు. బాడీ షేమింగ్ వంటి సమస్యలపై ఈషా రెబ్బా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఇక ఓం ఓం శాంతి సినిమా విషయానికి వస్తే.. ఏ.ఆర్. సజీవ్ దర్శకత్వం వహిస్తున్న మూవీలో ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నారు. ఆయన భార్యగా ఈషా రెబ్బా యాక్ట్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న సినిమాపై మంచి అంచనాలున్నాయి. విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. మరి ఈషాకు ఓం శాంతి శాంతి మూవీతో ఎలాంటి హిట్ దక్కుతుందో వేచి చూడాలి.