బ్యూటీ బైక్ ఎక్కితే స్పీడో మీటర్ పరుగే పరుగు!
బైక్ రైడింగ్ అంటే గుర్తొచ్చేది ఇద్దరే ఒద్దరు. టాలీవుడ్ లో నాగచైతన్య...కోలీవుడ్లో తల అజిత్. ఇద్దరు మాంచి రేసర్లు.
By: Srikanth Kontham | 9 Aug 2025 12:42 PM ISTబైక్ రైడింగ్ అంటే గుర్తొచ్చేది ఇద్దరే ఒద్దరు. టాలీవుడ్ లో నాగచైతన్య...కోలీవుడ్లో తల అజిత్. ఇద్దరు మాంచి రేసర్లు. కానీ రేసింగ్ లో ఇప్పుడంత యాక్టివ్ గా పాల్గొనడం లేదు. సినిమా-రేసింగ్ రెండింటిఈ బ్యాలెన్స్ చేయడం కుదరక పొవడంతో రేర్ గానే రేసింగ్ లో కనిపిస్తున్నారు. కానీ నాగచైతన్య మాత్రం తనకు కొడుకు పుడితే పెద్ద రేసర్ ని చేస్తానని అభిమానులకు ప్రామిస్ చేసారు. తాను చేరుకోలేని హైట్స్ ని కొడుకు రూపంలో సాధిస్తానని ప్రామిస్ చేసారు. అటు అజత్ వయసు మీరడం...వరుస యాక్సిడెంట్లు వంటి సన్నివే శాలు రేసింగ్ పై ఆసక్తి తగ్గించేలా చేసాయి.
అజిత్ ఈ మధ్యనే తీసుకున్న నిర్ణయం ఇది. వాళ్ల సంగతి పక్కన బెడితే? వాళ్ల తరహాలోనే తానేం తక్కువ కాదంటోంది టాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషారెబ్బా. తాను కూడా మాంచి బైక్ రేసర్ అంటూ ప్రొజెక్ట్ చేసుకుంటోంది. బైక్ ఎక్కితే స్పీడో మీటర్ ని ఒకటే పరుగు పెట్టిస్తానంటోంది. బోర్ కొడితే సింగిల్ గానే బైక్ రైడింగ్ కి దిగుతుందిట. కాంపిటీషన్ లో పాల్గొనడం చాలా అరుదైనా?.. ఇంటి దగ్గర ఖాళీగా ఉండి బోర్ కొడితే మాత్రం రేసిగ్ ట్రాక్ ఎక్కిపోతానంటోంది. రేసింగ్ కి సంబంధించిన స్పోర్స్ట్ దుస్తులు ధరించి బరిలోకి దిగిపోతానంది. అన్ని రకాల భద్రతా ప్రమాణాలను మాత్రం కచ్చితంగా పాటిస్తానని తెలిపింది.
రేసింగ్ ఆస్వాదన ఎంత గొప్పగా ఉంటుందో? ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితులు అంతే దారుణంగా ఉంటాయంది. వాటిని గుర్తు చేసుకున్న సమయంలో కాస్త భయం పుట్టినా ఓ రేసర్ గా మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్లడం ముఖ్యమంటోంది. ఈషా రేసింగ్ విశేషాలు ఇలా ఉన్నాయి. ఇక అమ్మడి కెరీర్ సంగతి చూస్తే! ప్రయాణం మాత్రం నత్తనడకనే సాగుతోంది. సినిమా చేసి రెండేళ్లు అవుతుంది. చివరిగా సుదీర్ బాబుకు జోడీగా 'మామ మశ్చింద్ర'లో నటించింది. ఆ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు.
అదే ఏడాది కొన్ని వెబ్ సిరీస్ లతోనూ ప్రేక్షకుల్ని అలరించింది. కానీ అక్కడా బిజీ కాలేకపోయింది. సీనియర్ భామల దూకుడు..నవ నాయికల తాకిడి కారణంగా ఛాన్పులు అందుకోవడంలో వెనుకబడింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తుంది. రీల్స్ తో అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. నెట్టింట అమ్మడి ఫాలోయింగ్ కూడా రెట్టింపు అయింది. రీల్స్ తో యువత అటెన్షన్ డ్రా చేస్తుంది. మరి ఈ క్రేజ్ తో కొంగొత్తగా అవకాశాలను అందుకోవాలని ఆశీద్దాం.
