Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి తెలుగు హారర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సాధారణంగా థియేటర్లలో విడుదలైన చిత్రాలు నెలలోపు లేదా 4 వారాలు మహా అంటే 8 వారాల లోపు ఓటీటీ లోకి వచ్చేస్తుంటాయి.

By:  Madhu Reddy   |   18 Feb 2026 1:38 PM IST
ఓటీటీలోకి తెలుగు హారర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

సాధారణంగా థియేటర్లలో విడుదలైన చిత్రాలు నెలలోపు లేదా 4 వారాలు మహా అంటే 8 వారాల లోపు ఓటీటీ లోకి వచ్చేస్తుంటాయి. అయితే ఈ ఓటీటీలోకి రావడం అనేది ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యేటప్పుడు తీసుకునే ఒప్పందం లేదా థియేటర్ రన్ లేదా సినిమా కంటెంట్ ను బట్టి ఓటీటీలోకి వచ్చే సమయం కూడా మారుతూ ఉంటుంది. ఒకవేళ థియేటర్లో విడుదలైన సినిమా సూపర్ హిట్ అందుకుంది అంటే మాత్రం ఇంకొంతకాలం ఆ సినిమాను థియేటర్లలోనే కొనసాగిస్తారు. ఇక భారీ బడ్జెట్ చిత్రం అయినా సరే తొలిరోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అంటే వారంలోపే ఓటీటీలోకి వచ్చిన చిత్రాలు కూడా లేకపోలేదు.

ఇకపోతే మరికొన్ని చిత్రాలు చెప్పా పెట్టకుండా ఓటీటీలోకి వచ్చేసి అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి చిత్రాలలో ఈషా కూడా ఒకటి. ఈవారం ఓటీటీలలో చెప్పుకోదగ్గ తెలుగు రిలీజ్ ఏవి లేవు. ఉన్నవి కూడా డబ్బింగ్.. పైగా హిందీ చిత్రాలు. అలాంటిది ఇప్పుడు సడన్గా ఒక తెలుగు హారర్ మూవీ స్ట్రీమింగ్ కి రావడంతో అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. మరి ఏ ఫ్లాట్ ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది? అసలు ఏంటా తెలుగు హారర్ మూవీ? ఈ సినిమా స్టోరీ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన తెలుగు హారర్ మూవీ ఈషా. ఐఎండీబీలో 9.3 రేటింగ్ దక్కించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. అలాంటి ఈ చిత్రం దాదాపు రెండు నెలల తర్వాత పైగా చెప్పకుండా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం విదేశాలలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.. ఇక మన దేశంలో ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏది ఏమైనా ఓటీటీలోకి వచ్చేసిందని సంతోషపడే లోపే అభిమానులను నిరాశపరిచారు చిత్ర బృందం.

సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కథలో నలుగురు ప్రాణ స్నేహితులు ( హెబ్బా పటేల్, త్రిగుణ్ , సిరి హనుమంత్, అఖిల్ రాజ్) ఉంటారు. వీళ్ళకి జనాలను మోసం చేసే దొంగ బాబాలన్నా.. మూఢనమ్మకాలన్నా అస్సలు నచ్చదు. ఎలాగైనా సరే ఆ మోసాలను అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఒక బాబా చూస్తున్న క్షుద్ర పూజలను లైవ్ లో పట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోనే వీరంతా కూడా ఒక పాత బంగ్లాకి వెళ్తారు. అక్కడ వాళ్ళు కెమెరాలు పెట్టి అసలు ఏం జరుగుతుందో కనిపెట్టాలనుకుంటారు. అక్కడే ఊహించని విధంగా నిజంగానే కొన్ని వింత సంఘటనలు ఎదురవుతాయి. మరి ఆ ఇంట్లో ఏదో తెలియని భయంకరమైన శక్తి ఉందని నిదానంగా వాళ్లు అర్థం చేసుకుంటారు. ఇక వారు వేసిన ప్లాన్ కాస్త రివర్స్ అవడంతో ఆ నలుగురు స్నేహితులు ప్రాణాలతో బయటపడడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు.

ఇక ఆ ఇంట్లో ఉన్న ఆత్మ ఎవరు? ఆ ఆధ్యాత్మిక గురువుకు ఆ ఇంటికి ఉన్న సంబంధం ఏమిటి ? చివరికి ఆ స్నేహితులు ఆ బంగ్లా నుండి బయటపడ్డారా ? ఇలా అన్ని విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికైతే హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అటు ఐఎండీబీలో కూడా మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంది. మరి అలాంటి ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.