Begin typing your search above and press return to search.

'ఈషా' బాక్సాఫీస్.. టార్గెట్ ఫినిష్

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర పెద్ద సౌండ్ చేయడం ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ గా మారింది. క్రిస్మస్ కానుకగా వచ్చిన 'ఈషా' సినిమా విషయంలోనూ సరిగ్గా ఇదే జరుగుతోంది.

By:  M Prashanth   |   28 Dec 2025 1:30 PM IST
ఈషా బాక్సాఫీస్.. టార్గెట్ ఫినిష్
X

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర పెద్ద సౌండ్ చేయడం ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ గా మారింది. క్రిస్మస్ కానుకగా వచ్చిన 'ఈషా' సినిమా విషయంలోనూ సరిగ్గా ఇదే జరుగుతోంది. రిలీజ్ రోజు సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కథలో కొత్తదనం లేదని, నెరేషన్ స్లోగా ఉందని విమర్శలు వచ్చాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంది.

సాధారణంగా డివైడ్ టాక్ వస్తే కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం చూస్తుంటాం. కానీ 'ఈషా' హారర్ థ్రిల్లర్ జానర్ కావడం దీనికి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. రివ్యూలు, రేటింగ్స్ ఎలా ఉన్నా.. థియేటర్లో భయపడాలని, థ్రిల్ ఫీల్ అవ్వాలని కోరుకునే ఆడియెన్స్ ఈ సినిమాకు క్యూ కడుతున్నారు. మౌత్ టాక్ ఎలా ఉన్నా, టికెట్ కౌంటర్ల దగ్గర మాత్రం సందడి కనిపిస్తోంది.

లేటెస్ట్ గా ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ కు సంబంధించి మేకర్స్ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుందని ప్రకటించారు. అంతేకాకుండా సినిమా ఇప్పుడు ప్రాఫిట్ జోన్ లోకి అడుగుపెట్టింది. ఒక చిన్న సినిమా, అందులోనూ పరిమిత బడ్జెట్ తో తీసిన చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా ఇంత త్వరగా సేఫ్ అవ్వడం విశేషం.

ఇక కలెక్షన్స్ లెక్కలు చూస్తే.. కేవలం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఈ సినిమా మూడు రోజుల్లో 4.8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రేంజ్ నంబర్స్ వచ్చాయంటే, ఓవరాల్ గా సినిమా కమర్షియల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మేకర్స్ 'ది స్మాల్ ఫిల్మ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్' అని సోషల్ మీడియాలో మరింత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

పండగ సీజన్ కావడం, హారర్ సినిమాలకు ఉండే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. మిక్స్డ్ టాక్ ను తట్టుకుని నిలబడటమే కాకుండా, బయ్యర్లకు మూడు రోజుల్లోనే లాభాలు చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఏడాది 'క్రిస్మస్ విన్నర్' తామే అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించుకుంది.

ఏదేమైనా 'ఈషా' బాక్సాఫీస్ ప్రయాణం ఆశ్చర్యకరంగా సాగుతోంది. టాక్ ఒకలా ఉంటే, రెవెన్యూ మరోలా ఉంది. వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, సోమవారం నుంచి కూడా ఇదే జోరు చూపిస్తే ఫైనల్ రన్ లో మరిన్ని మంచి లాభాలు చూసే అవకాశం ఉంది. కంటెంట్ పరంగా కొంత టాక్ భిన్నంగా ఉన్నా, కమర్షియల్ గా మాత్రం 'ఈషా' గట్టెక్కినట్లే.