'ఈషా'.. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఇవే!
అయితే క్లైమాక్స్ ట్విస్ట్ బాగుందని కొందరు అంటున్నారు. సాధారణంగా హారర్ సినిమాలకు రివ్యూలతో, టాక్ తో పనిలేకుండా థియేటర్ కు వెళ్లే సెపరేట్ ఆడియెన్స్ ఉంటారు. ఇప్పుడు అదే ఈ సినిమాకి కలిసొస్తోంది.
By: M Prashanth | 27 Dec 2025 1:11 PM ISTబన్నీ వాసు, వంశీ నందిపాటి బ్యాకింగ్ తో వచ్చిన 'ఈషా' సినిమా బాక్సాఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. త్రిగుణ్, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ హారర్ థ్రిల్లర్ క్రిస్మస్ స్పెషల్ గా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ప్రమోషన్స్ లో హారర్ ఛాలెంజ్ అంటూ చేసిన హడావిడి వల్ల ఓపెనింగ్స్ పరంగా సినిమాకి డీసెంట్ బజ్ క్రియేట్ అయ్యింది.
సినిమా రిలీజ్ అయ్యాక టాక్ విషయానికి వస్తే మిక్స్డ్ రెస్పాన్స్ వినిపిస్తోంది. హారర్ ఎలిమెంట్స్ రొటీన్ గా ఉన్నాయని, నెరేషన్ స్లోగా ఉందని రివ్యూలు వచ్చాయి. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ బాగుందని కొందరు అంటున్నారు. సాధారణంగా హారర్ సినిమాలకు రివ్యూలతో, టాక్ తో పనిలేకుండా థియేటర్ కు వెళ్లే సెపరేట్ ఆడియెన్స్ ఉంటారు. ఇప్పుడు అదే ఈ సినిమాకి కలిసొస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకి హారర్ జానర్ లవర్స్ ప్లస్ అవుతున్నారు. సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉన్నా, గ్రౌండ్ లెవెల్ లో టికెట్ తెగుతున్నట్లు అర్థమవుతోంది. పండగ సీజన్ కావడం, పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా 'ఈషా'కి అడ్వాంటేజ్ గా మారింది. 'ది ఫియర్.. అండ్ ది కలెక్షన్స్' అంటూ మేకర్స్ కూడా సినిమా జోరును హైలైట్ చేస్తున్నారు.
బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే.. లేటెస్ట్ గా చిత్ర యూనిట్ కలెక్షన్స్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీని ప్రకారం కేవలం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఈ సినిమా 2 రోజుల్లో 3.6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక చిన్న సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం కచ్చితంగా మంచి నంబర్స్ అనే చెప్పాలి.
మిక్స్డ్ టాక్ నడుస్తున్నా కూడా ఈ రేంజ్ ఫిగర్స్ నమోదు చేయడం అంటే, ఆడియెన్స్ హారర్ కంటెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారనే చెప్పాలి. పోస్టర్ లో "ట్రూ క్రిస్మస్ విన్నర్" అని మేకర్స్ వేసుకున్నారు. లిమిటెడ్ బడ్జెట్ తో తీసిన సినిమా కాబట్టి, రికవరీ పరంగా నిర్మాతలు ప్రస్తుతానికి సేఫ్ జోన్ వైపే వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే సినిమా ఇంకా ఆడియన్స్ నీ మరింత ఎట్రాక్ట్ చేయాల్సి ఉంది. ఈ కలెక్షన్స్ వీకెండ్ మొత్తం కొనసాగితేనే బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటే అవకాశం ఉంటుంది. సోమవారం నుంచి సినిమా హోల్డ్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి అసలైన ఫలితం తేలుతుంది. ప్రస్తుతానికి అయితే బాక్సాఫీస్ దగ్గర 'ఈషా' పర్ఫార్మెన్స్ పర్వాలేదనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.
