Begin typing your search above and press return to search.

ఫ్రాన్స్ థియేటర్లలో ఈగ.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..

ముఖ్యంగా సినిమా చివర్లో వచ్చే ఒక సీన్ కు ఫ్రాన్స్ ఆడియన్స్ ఇచ్చిన రియాక్షన్ అద్భుతంగా ఉంది.

By:  M Prashanth   |   29 Jun 2026 9:35 AM IST
ఫ్రాన్స్ థియేటర్లలో ఈగ.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..
X

టాలీవుడ్ స్థాయిని గ్లోబల్ రేంజ్ కి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి సినిమాలకు ఇప్పుడు యూరప్ లో స్పెషల్ స్క్రీనింగ్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబుతో చేస్తున్న కొత్త సినిమా వారణాసి ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రాన్స్ లో ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ప్రదర్శించిన ఈగ సినిమాకి ఫ్రాన్స్ లోని ప్రేక్షకుల నుంచి అదిరిపోయేలా రెస్పాన్స్ వస్తోంది.

ఫ్రాన్స్ లో జరిగిన ఈగ స్పెషల్ స్క్రీనింగ్ కు ఊహించని స్థాయిలో జనం వచ్చారు. సినిమా చూస్తున్నంతసేపు థియేటర్లన్నీ చప్పట్లు కేరింతలతో దద్దరిల్లాయి. మన లోకల్ ఆడియన్స్ లాగే విదేశీ ప్రేక్షకులు కూడా సీన్స్ కు కనెక్ట్ అవుతూ ఎంజాయ్ చేయడం అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. భాషతో సంబంధం లేకుండా ఒక చిన్న ఈగ చేసే విన్యాసాలకు అక్కడి జనాలు పూర్తిగా ఫిదా అయిపోయారు.

ముఖ్యంగా సినిమా చివర్లో వచ్చే ఒక సీన్ కు ఫ్రాన్స్ ఆడియన్స్ ఇచ్చిన రియాక్షన్ అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ లో ఈగ రీఎంట్రీ ఇవ్వడంతో పాటు ఆ ఈగ వేసే స్టెప్పులకు ఆడియన్స్ క్లాప్స్ కొడుతూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ప్యారిస్ థియేటర్ లో జనాల గోలతో పక్కా మాస్ వాతావరణం కనిపించింది. ఈ స్క్రీనింగ్ కు సంబంధించిన వీడియోను మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ కథకు విదేశీయులు ఇంతలా రియాక్ట్ అవ్వడం వెనుక ఉన్న ఎమోషన్స్ ప్రధాన కారణం. పదేళ్ల క్రితం వచ్చిన సినిమా అయినా సరే నేటి జనరేషన్ కు ఏమాత్రం బోర్ కొట్టకుండా టెక్నికల్ గా స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వడం హైలెట్. దర్శకుడు ఎంచుకున్న యూనివర్సల్ పాయింట్ కు హద్దులు ఉండవని ఈ స్క్రీనింగ్ రియాక్షన్స్ ద్వారా మరోసారి రుజువైంది.

వారణాసి గ్లోబల్ ప్రమోషన్స్ కోసం వేసిన ప్లాన్ లో ఈ థియేట్రికల్ రెస్పాన్స్ చాలా కీలకంగా మారింది. ఇలా పాత హిట్ సినిమాలను చూపిస్తూనే వారణాసి గ్లింప్స్ ను ప్రదర్శించడం ద్వారా రాబోయే ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీ పెంచుతున్నారు. సినిమా రిలీజ్ కు ముందే అక్కడి ఆడియన్స్ తో ఒక ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేసుకోవడంలో సినిమా యూనిట్ సక్సెస్ అవుతోంది.

జూలై 4వ తేదీ వరకు జరగనున్న ఈ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ టూర్ లో ఇంకా రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న, బాహుబలి స్క్రీనింగ్స్ కూడా జరగనున్నాయి. కేవలం ఈగ కే విదేశీయులు ఆ రేంజ్ లో రెస్పాండ్ అయితే ఇక మిగతా యాక్షన్ సీన్స్ కు థియేటర్లు ఇంకెంత షేక్ అవుతాయో చూడాలి. ఇక ఈ గ్లోబల్ టూర్ వారణాసి సినిమాకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక సాలిడ్ బేస్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.