ఎప్పుడూ చూడని టైటిల్ తో థ్రిల్లర్.. టీజర్ తో హైప్ పెంచేలా..
లేటెస్ట్ గా ఆ సినిమా టీజర్ ను దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ఫిల్మోత్సవ్ బ్యానర్ పై చంద్రసిద్ధార్థనే నిర్మించారు. వై.వి. సత్యనారాయణ రాజు సమర్పిస్తున్నారు.
By: M Prashanth | 15 Sept 2026 7:49 PM ISTసినిమాకు స్టోరీ ఎంత ముఖ్యమో.. టైటిల్ కూడా అంతే. కానీ అదే టైటిల్ ఏకంగా చాలా పొడవుగా ఉంటే? ప్రేక్షకులు ఒక్కసారి ఆగి చూస్తారు. ఇప్పుడు అలాంటి వెరైటీ టైటిల్ తో ఓ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే దర్శకుడు చంద్ర సిద్ధార్థ తెరకెక్కించిన 'ఈ పాట కోరినవారు నెమలి పాలెం నుండి రామ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు'. ఆ మూవీకి అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్ కూడా ఉంది.
లేటెస్ట్ గా ఆ సినిమా టీజర్ ను దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ఫిల్మోత్సవ్ బ్యానర్ పై చంద్రసిద్ధార్థనే నిర్మించారు. వై.వి. సత్యనారాయణ రాజు సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే టీజర్ ను విడుదల చేసిన అనిల్ రావిపూడి.. సినిమా టైటిల్, కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉన్నాయని మూవీ టీమ్ కు అభినందించారు. చంద్ర సిద్ధార్థతో తనకున్న పాత రిలేషన్ ను కూడా గుర్తు చేసుకున్నారు.
గతంలో చంద్ర సిద్ధార్థ తెరకెక్కించిన మధుమాసం, హౌస్ ఫుల్, అందరి బంధువయా సినిమాలకు తాను స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేశానని రావిపూడి చెప్పారు. ఇక ఆ సినిమా టైటిల్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఇంట్రెస్ట్ ను పెంచుతోంది. ఇంత పొడవైన టైటిల్ ను పెట్టడమే ఒక ప్రయోగంగా కనిపిస్తోంది. అయితే టైటిల్ మాత్రమే కాదు.. సినిమా కథ కూడా అంతే కొత్తగా ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది.
సౌండ్, మ్యూజిక్, మనిషి బ్రెయిన్, మెమోరీస్ చుట్టూ సినిమా స్టోరీ తిరుగుతుందని టీజర్ ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, మెమోరీస్, గిల్ట్ వంటి ఎలిమెంట్స్ ను థ్రిల్లర్ స్టోరీలో మిక్స్ చేసినట్లు సమాచారం. అందుకే ఆ సినిమాను నార్మల్ థ్రిల్లర్ గా కాకుండా మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్ గా రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని వింత పరిస్థితులను కూడా చూపించారు మేకర్స్.
అయితే అసలు కథ ఏంటి? ఆ పాత్రల మధ్య సంబంధం ఏమిటి? బ్రెయిన్, మ్యూజిక్, మెమోరీస్ కు కథతో ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలను మాత్రం టీజర్ లో పూర్తిగా చెప్పలేదు. దీంతో అసలు మిస్టరీ ఏంటన్న ఇంట్రెస్ట్ పెరిగింది. టీజర్ తో సినిమాపై హైప్ కూడా క్రియేట్ అయింది. ఇక సినిమాతో హర్ష హీరోగా పరిచయం అవుతున్నారు. అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనయా సుల్తానా, రవి వర్మ, అశోక్ వర్ధన్, రేఖ నిరోషా తదితరులు నటించారు.
జె. రెక్స్ మ్యూజిక్ అందించగా.. శ్యామ్ సుప్రీత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. పులగం చిన్నారాయణ డైలాగ్స్ రాశారు. అయితే సినిమా టైటిలే ఇంత కొత్తగా ఉంటే.. మూవీ ఇంకెంత కొత్తగా ఉంటుందో? అనే ఇంట్రెస్ట్ ను ఇప్పుడు ఆడియన్స్ లో క్రియేట్ అవ్వగా.. మరి సెప్టెంబర్ 18న వస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
