Begin typing your search above and press return to search.

'ఈNఈ రిటర్న్స్ ' రిలీజ్ డేట్ వచ్చేసింది...

'పెళ్లిచూపులు' సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను స్టార్ట్ చేసిన తరుణ్ భాస్కర్ మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు ను అందుకున్నాడు.

By:  Gopi Velupala   |   13 Oct 2026 8:06 PM IST
ఈNఈ రిటర్న్స్  రిలీజ్ డేట్ వచ్చేసింది...
X

'పెళ్లిచూపులు' సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను స్టార్ట్ చేసిన తరుణ్ భాస్కర్ మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు ను అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన 'ఈ నగరానికి ఏమైంది' మూవీలో చిన్నప్పటి నలుగురి ఫ్రెండ్స్ ప్రయాణం ఎలా మొదలైంది. వాళ్ల కలలేంటి?వాళ్ల మధ్య వచ్చిన గొడవలేంటి? అనేది ఇప్పటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా చాలా క్లారిటీ గా తెరకెక్కించారు. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, సాయి సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని అందించింది...ఇప్పటికి ఈ మూవీని రిపిటెడ్ గా చూసే ప్రేక్షకులు ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితం వరకు తరుణ్ భాస్కర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రేక్షకులు ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడొస్తుంది అంటూ అతన్ని అడిగేవారు.





రిలీజ్ డేట్ క్లారిటీ...

నిజానికి తరుణ్ భాస్కర్ డైరెక్షన్ ను పక్కన పెట్టి నటన మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే కొన్ని మంచి క్యారెక్టర్స్ ను చేశాడు. ప్రేక్షకుల్లో ఈ నగరానికి ఏమైంది సినిమా సీక్వెల్ కి ఉన్న క్రేజ్ ను వాడుకుంటూ మరోసారి తను మెగా ఫోన్ పట్టాడు. 'ఈ N ఈ రిటర్న్' పేరుతో ఈ మూవీ స్టార్ట్ చేశాడు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్ బ్యానర్స్ మీద ఈ మూవీ తెరకెక్కుతుండటం విశేషం... ఈ సినిమా కోసం కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్న ప్రేక్షకుల నిరీక్షణకు తెరదించుతూ మేకర్స్ నవంబర్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందంటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు... సీక్వెల్ లో విశ్వక్ సేన్, అభినవ్ గోమట్టం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో కార్తీక్ క్యారెక్టర్ లో కనిపించిన సాయి సుశాంత్ రెడ్డి ఈ మూవీలో చేయడం లేదు. అతని ప్లేసులో శ్రీనాథ్ మాగంటి చేస్తున్నాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాటలు బాగా వచ్చాయని మేకర్స్ కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.

రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇప్పటి నుంచి నవంబర్ 19 కోసం యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. యూత్ ఫుల్ సబ్జెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆసక్తి ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో సీక్వెల్ సినిమాలకి హవా పెరుగుతున్న క్రమంలో ఈ నగరానికి ఏమైంది సినిమా వచ్చి 8 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఈ సినిమాకి క్రేజ్ తగ్గడం లేదు. మొదటి పార్ట్ కి మించి సీక్వెల్ సూపర్ సక్సెస్ అవుతుందని సినిమా యూనిట్ కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు...