క్రేజీ సీక్వెల్.. సంచలన నిర్ణయం
రిలీజ్కు నెల రోజుల ముందు కూడా టీజర్ వదలకపోవడంతో సినిమా అనుకున్న ప్రకారం రిలీజ్ కాదేమో అనుకుంటున్నారంతా.
By: Garuda Media | 23 Oct 2026 7:47 PM ISTభారీ పాన్ ఇండియా సినిమాలకే కాదు.. కామెడీ ఎంటర్టైనర్లకు కూడా ఇప్పుడు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. వాటికీ క్రేజ్ ఉంటోంది. ‘ఈ నగరానికి ఏమైంది-2’ ఈ కోవకు చెందిన సినిమానే. రిలీజైనపుడు ఒక మోస్తరు విజయాన్నందుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ప్రేక్షకులు డిమాండ్ చేసి మరీ దీనికి సీక్వెల్ తెరకెక్కేలా చేశారు. తరుణ్ భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత ఎంతో మనసు పెట్టి ‘ఈఎన్ఈ-2’ తీస్తున్నాడు.
ఐతే సుదీర్ఘ కాలంగా సెట్స్ మీద ఉన్న ఈ సినిమా నుంచి టీం ఏ అప్డేట్ ఇవ్వలేదు. ముందు ప్రకటించినట్లు వచ్చే నెల 20న ఈ చిత్రం రిలీజవుతుందా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా.. టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ హైప్ పెంచే ప్రయత్నం చేయడం మామూలే. ఇది ప్రతి సినిమా మేకర్స్ అనుసరించే పద్ధతే. కానీ ‘ఈఎన్ఈ-2’ టీం మాత్రం సైలెంటుగా ఉంటోంది.
రిలీజ్కు నెల రోజుల ముందు కూడా టీజర్ వదలకపోవడంతో సినిమా అనుకున్న ప్రకారం రిలీజ్ కాదేమో అనుకుంటున్నారంతా. కానీ ఇదంతా టీం స్ట్రాటజీలో భాగమట. రెగ్యులర్గా అన్ని సినిమాలకూ చేసినట్లే దీనికి పబ్లిసిటీ చేయొద్దని టీం భావిస్తోందట. దీనికి టీజర్ కానీ.. సాంగ్స్ కానీ.. ఇతర ప్రోమోలు కానీ ఏమీ రిలీజ్ చేయరట. నేరుగా రిలీజ్ ముంగిట ఒక థియేట్రికల్ ట్రైలర్ మాత్రం వదులుతుందట.
ఇలాంటి క్రేజీ సీక్వెల్ కు.. పబ్లిసిటీ ఇలా ప్లాన్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే జనాల్లో ఈ సినిమా మీద కావాల్సినంత క్యూరియాసిటీ ఉందని.. కాబట్టి వేరే ప్రమోషన్లు అవసరం లేదని.. సినిమా ఎలా ఉండబోతోందో తెలియజేస్తూ రిలీజ్ ముంగిట ట్రైలర్ వదిలితే చాలని తరుణ్ భాస్కర్ అండ్ టీమ్ ఫిక్సయిందట. ‘ఈ నగరానికి ఏమైంది’లో కీలక పాత్రలు పోషించిన విశ్వక్సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ఇందులోనూ కొనసాగనుండగా.. సుశాంత్ రెడ్డి స్థానంలోకి మాత్రం వేరే నటుడొచ్చాడు.
