బాలీవుడ్ హీరోయిన్‌కు ఈడీ షాక్
ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న విషయంలో పలువురికి ఈడీ నోటీసులు పంపగా, తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా, మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి నోటీసులిచ్చింది.
By: Sravani Lakshmi Srungarapu | 15 Sept 2025 4:03 PM ISTఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటుంది. కొన్ని రోజులుగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న విషయంలో పలువురికి ఈడీ నోటీసులు పంపగా, తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా, మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి నోటీసులిచ్చింది.
సెప్టెంబర్ 16న ఈడీ ఆఫీసులో హాజరు కావాలని ఆదేశాలు
ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారగా సెప్టెంబర్ 16న ఊర్వశీ రౌతెలా ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం వారిద్దరినీ విచారణ చేసి, దాని కోసం వారు ఎప్పుడు ఎలా డబ్బులు తీసుకున్నారో కూడా తెలుసుకోవాలని ఈడీ ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే రోజుల్లో మరింత మంది సెలబ్రిటీలకు ఈడీ సమన్లు జారీ చేసే అవకాశముందని సమాచారం. ఈ ఇల్లీగల్ నెట్‌వర్క్ మొత్తాన్ని మూలాల నుంచి నిర్మూలించడమే లక్ష్యంగా ఈడీ పని చేస్తోంది. మనీ లాండరింగ్ కేసులో ప్రమేయమున్న తారలందరికీ ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం.
కెరీర్ పై ఎఫెక్ట్ చూపుతుందా?
ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లతో సహా ఎంతో మంది ప్రముఖులను ఈడీ ప్రశ్నించగా, ఈ కేసులో వారి ప్రమేయం ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి ఈడీ ప్రయత్నిస్తోంది. అయితే ఎప్పుడూ కాన్ఫిడెంట్ గా ఉంటూ ఆన్ లైన్ లో బాగా యాక్టివ్ గా ఉండే ఊర్వశీకి సడెన్ గా వచ్చిన ఈడీ నోటీసులు చాలా పెద్ద షాకిచ్చాయి. ఈ కేసులో ఆమె పేరు రావడంతో దాని ఎఫెక్ట్ తన కెరీర్ పై పడే ఛాన్సు కూడా ఉంది.
ఎందుకంటే ఈ కేసు నుంచి బయటపడే వరకు ఊర్వశి ఓ వైపు కెరీర్ ను ముందుకు తీసుకెళ్తూనే మరోవైపు లీగల్ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంది. ఈ కేసు దర్యాప్తు తర్వాత వచ్చే ఫలితాలు ఊర్వశి కెరీర్ పై పడే అవకాశాలున్నాయి. ఈ కేసులో ఊర్వశీ, మిమి చక్రవర్తి లాంటి ప్రముఖ పేర్లు వినిపిస్తుండటం వల్ల ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ కు మద్దతుని తెలుపుతూ ప్రచారం చేసే మిగిలిన సెలబ్రిటీల గురించి ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఈ కేసులో దర్యాప్తు ఎలా కొనసాగుతుందో, కేసులో ఇరుక్కున్న వారికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
