దానయ్యకు మళ్లీ లక్ కలిసొస్తుందా?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తున్నారు.
By: M Prashanth | 24 Sept 2025 9:52 AM ISTటాలీవుడ్ ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తున్నారు. 33 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన జంబలకిడి పంబ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పటి వరకు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జులాయి, కెమెరామెన్ గంగతో రాంబాబు సహా ఎన్నో సినిమాలు తీశారు.
చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆస్కార్ లెవెల్ లో కూడా ఆ సినిమా అదరగొట్టింది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీతో దానయ్య.. భారీ లాభాలను అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా ఓ రేంజ్ లో అలరించడంతో.. తాను పెట్టిన బడ్జెట్ కు మించిన ప్రాఫిట్స్ ను సాధించారు.
అలా ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో దానయ్యకు లక్ బాగా కలిసొచ్చింది. అయితే ఇప్పుడు ఆయన మరికొన్ని గంటల్లో ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించగా.. సుజీత్ దర్శకత్వం వహించారు. తన బ్యానర్ పై కొడుకుతో కలిసి దానయ్య గ్రాండ్ గా నిర్మించారు.
ఇప్పుడు ఓజీ మూవీకి కూడా దానయ్యకు లక్ కలిసొస్తుందా.. మళ్లీ ఆర్ఆర్ఆర్ తో వచ్చిన లాభాలను అందుకుంటారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఓజీని సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు టాక్ వినిపిస్తోంది. రెమ్యూనరేషన్లు రూ.100 కోట్లు కాగా.. నిర్మాణ, ప్రమోషన్ల ఖర్చు రూ.100 కోట్లు అవ్వొచ్చని టాక్.
అయితే ఇప్పటికీ ఓజీ బిజినెస్ అద్భుతంగా జరిగినట్లు తెలుస్తోంది. నాన్- థియేట్రికల్ రైట్స్ ను రూ.113 కోట్లకు అమ్మినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ హక్కులను రూ. 180 కోట్లకు పైగా సేల్ చేసినట్లు టాక్. దీంతో మొత్తంగా దాదాపు రూ. 300 కోట్లు వసూలు చేసింది. బడ్జెట్ కన్నా ఎక్కువ మొత్తంలో ఇప్పటికే వచ్చినట్లే!
దీంతో ఇప్పుడు కూడా దానయ్యకు ఓజీ మూవీకి గాను లక్ కలిసొచ్చినట్టు కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సేఫ్ జోన్ లో ఉన్నారని.. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షమేనని అంటున్నారు. మళ్లీ ఆర్ఆర్ఆర్ కు వచ్చినట్లే లాభాలు అందుకుంటారని అంచనా వేస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
