వీకెండ్స్ మూవీ మజా..ఓటీటీలో సందడి చేస్తున్న చిత్రాలు/సిరీస్ లివే..
ఎప్పటిలాగే ఈవారం కూడా ప్రేక్షకులను అలరించడానికి కొన్ని చిత్రాలు వెబ్ సిరీస్ లు ఓటీటీ బాట పట్టిన విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 3 Oct 2025 12:48 PM ISTఎప్పటిలాగే ఈవారం కూడా ప్రేక్షకులను అలరించడానికి కొన్ని చిత్రాలు వెబ్ సిరీస్ లు ఓటీటీ బాట పట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ దసరా వీకెండ్స్ లో కొత్త సినిమాలు చూడాలనుకునే వారికోసం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. మరి ఈ శుక్ర, శని, ఆదివారాలలో సినిమాలు, సిరీస్ లు చూసి ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ చిత్రాలు, వెబ్ సిరీస్ లు మంచి కంటెంట్ తో సిద్ధం అయిపోయాయి. మరి ఈ దసరా వీకెండ్స్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన ఆ చిత్రాలు, వెబ్ సిరీస్ లో ఏంటి? ఏ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
ఈటీవీ విన్:
లిటిల్ హార్ట్స్: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి.. ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది లిటిల్ హార్ట్స్. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ యాప్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇందులో లిటిల్ హార్ట్స్ 2కి లీడ్ ఇస్తూ అదనపు సన్నివేశాలను జోడించి ఓటీటీ ప్రేక్షకుల కోసం కొత్తగా తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లిటిల్ హార్ట్స్ ఇటు ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో:
మదరాసి: యాక్షన్ చిత్రాలు కోరుకునే వారి కోసం మదరాసి సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా, బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా వేదికగా..
జూనియర్: రొమాంటిక్ లవ్ డ్రామా కోసం చూసే ఆడియన్స్ కి జూనియర్ మూవీ బెస్ట్ గా నిలిచింది. కిరీటి రెడ్డి హీరోగా శ్రీ లీలా హీరోయిన్ గా, జెనీలియా కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.. ఈ చిత్రానికి రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు.
నెట్ ఫ్లిక్స్:
శ్రద్ధా శ్రీనాథ్ - ది గేమ్ :
శ్రద్ధ శ్రీనాథ ప్రధాన పాత్రలో వచ్చిన వెబ్ సిరీస్ 'ది గేమ్:యు నెవర్ ప్లే అలోన్'.. అక్టోబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తనకు ఎదురైన సవాళ్లను మహిళా గేమ్ డెవలపర్ ఎలా అధిగమించింది అనే పాయింట్ తోనే దీనిని రూపొందించారు. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
ఇఫ్ - ఇంగ్లీష్ మూవీ
జీనీ మేక్ విష్ - కొరియన్ మూవీ
వింక్స్ క్లబ్ - ది మ్యాజిక్ ఈజ్ బ్యాక్ సీజన్ వన్
డూడ్స్ సీజన్ వన్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)
సన్ నెక్స్ట్ :
టైల్స్ ఆఫ్ ట్రెడిషన్ (వెబ్ సిరీస్)
ఆపిల్ ప్లస్ టీవీ :
ది సిస్టర్స్ గ్రిమ్ (యానిమేటెడ్ వెబ్ సిరీస్)
జియో హాట్ స్టార్:
అన్నపూరణి
అబాట్ ఎలిమెంటరీ (వెబ్ సిరీస్)
