Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ కి పోటీ యంగ్ హీరో కెరీర్ లో తొలిసారి!

దసరా పండుగ సీజన్ బాక్సాఫీస్ వద్ద పోరు ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈసారి దసరా రేస్ మ‌రీ అంత పోటీ లేక‌పోయినా? కొంత పోటీ అయితే? ఆసక్తికరంగా మారుతోంది.

By:  Srikanth Kontham   |   29 Aug 2026 9:00 PM IST
సూప‌ర్ స్టార్ కి పోటీ యంగ్ హీరో కెరీర్ లో తొలిసారి!
X

దసరా పండుగ సీజన్ బాక్సాఫీస్ వద్ద పోరు ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈసారి దసరా రేస్ మ‌రీ అంత పోటీ లేక‌పోయినా? కొంత పోటీ అయితే? ఆసక్తికరంగా మారుతోంది. ఇండియన్ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న `జైలర్ 2` చిత్రంతో పాటు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా న‌టిస్తోన్న `రణబాలి` చిత్రం కూడా అక్టోబర్ 16న బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగ‌డ‌డే ఇందుకు కారణం. విజయ్ దేవరకొండ కెరీర్‌లో అగ్ర నటుడి సినిమాకు పోటీగా ప్రత్యక్షంగా బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సాధారణంగా బాక్సాఫీస్ క్లాష్‌లను నివారించేందుకు చాలామంది హీరోలు వెనక్కి తగ్గుతుంటారు. అయితే `ర‌ణబాలి` కంటెంట్ మేకింగ్‌పై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంతో ఢీకొట్టేందుకు వెనుకాడలేదని తెలుస్తోంది . నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న `జైలర్ 2`పై దేశవ్యాప్తంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. మొదటి భాగం `జైలర్` సృష్టించిన ప్రభంజనం, సాధించిన వసూళ్లు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. అలాంటి సీక్వెల్ చిత్రంతో పోటీ పడటం అంటే ఏ హీరోకైనా పెద్ద సవాలే.

అయితే విజయ్ దేవరకొండ కూడా మాస్ యూత్ ఫాలోయింగ్‌లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు కావడంతో బాక్సాఫీస్ పోరు ఎంతో రసవత్తరంగా మారుతుంద‌ని ట్రేడ్ అంచనా వేస్తోంది. `రణబాలి` విజయ్ దేవర కొండ కెరీర్‌లోనే పవర్‌ఫుల్ అండ్ డిఫరెంట్ రోల్‌తో రూపొందుతోందని సమాచారం. విజయ్ ఎనర్జీ, డైరెక్టర్ విజన్ , మాస్ ఎలిమెంట్స్ కలగలిసి సినిమాను హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాయి.

దసరా హాలిడే సీజన్ సుదీర్ఘంగా ఉండటంతో రెండు సినిమాలకు కూడా థియేట్రికల్ రన్‌లో తగినంత స్కోప్ ఉంటుందనే యోచనలో 'రణబాలి' చిత్ర బృందం ఉంది. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. కంటెంట్ బలంగా ఉంటే ఒకే సీజన్‌లో ఎంత పెద్ద సినిమాలు పోటీ పడినా ప్రేక్షకులు రెంటినీ ఆదరిస్తున్నారని రీసెంట్ హిట్స్ నిరూపించాయి.

ఈ క్రమంలోనే దసరా పండుగ సెలవుల అడ్వాంటేజ్ తీసు కోవాలని బాక్సాఫీస్ వద్ద స్టామినాని మరోసారి పవర్ ఫుల్‌గా ప్రదర్శించాలని విజయ్ దేవరకొండ బ‌రిలోకి దిగుతున్న‌ట్లు కనిపిస్తోంది. వాస్త‌వానికి ద‌స‌రా బ‌రిలో చిరంజీవి న‌టిస్తోన్న `విశ్వంభ‌ర‌` నిలిచింది. కానీ అనూహ్యాంగా ఆ సినిమా ద‌సరాకు రాక‌పోవ‌డంతో ఇత‌ర సినిమాలు రిలీజ్ రేసులో ఉన్నాయి. ఈ క్ర‌మంలో `ర‌ణ‌బాలి` సీన్ లోకి వ‌చ్చింది. మ‌రి జైల‌ర్ 2...ర‌ణ‌బాలి వార్ లో ఏ సినిమాది పై చేయి అవుతుంద‌న్న‌ది చూడాలి.