దురంధర్ 'బాహుబలి 2'ని టచ్ చేయగలడా?
అయితే దురంధర్ లైఫ్ టైమ్ కలెక్షన్లలో పఠాన్, జవాన్ రికార్డులను కూడా చెరిపేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సుమారు1100 కోట్లు వసూలు చేసాయి.
By: Sivaji Kontham | 27 Dec 2025 11:07 PM ISTప్రపంచవ్యాప్త ఆదరణతో దంగల్, బాహుబలి 2 అసాధారణ రికార్డులను అందుకున్న సంగతి తెలిసిందే. దంగల్ చిత్రం దాదాపు 2000 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయగా, బాహుబలి 2 చిత్రం 1788 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు సినిమాల తర్వాత `పుష్ప 2` ఆ స్థాయి వసూళ్లను అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1742 కోట్లు వసూలు చేసింది. ఆ మేరకు ప్రఖ్యాత శాక్ నిల్క్ బాక్సాఫీస్ వివరాలను ధృవీకరించింది.
ఇప్పుడు ఆ మూడు సినిమాల రికార్డులను దురంధర్ బ్రేక్ చేయగలడా? అంటే.. దాని కోసం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా `ధురంధర్` ఇప్పటికే రికార్డుల్లోకెక్కింది. విడుదలైన మూడు వారాల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లను సాధిస్తూ, పలు రికార్డులను అధిగమించింది. ఈ ఏడాది బెస్ట్ హిట్స్ చావా, కాంతార చాప్టర్ 1 రికార్డుల్ని బ్రేక్ చేసిన ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరింది. విడుదలైన నాలుగో శుక్రవారం 23కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం కాగా, కేవలం 22 రోజుల్లో `దురంధర్` 1000 కోట్ల క్లబ్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ వసూళ్లతో ఆల్ టైమ్ టాప్ 10లో చేరింది.
అయితే దురంధర్ లైఫ్ టైమ్ కలెక్షన్లలో పఠాన్, జవాన్ రికార్డులను కూడా చెరిపేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సుమారు1100 కోట్లు వసూలు చేసాయి. గల్ఫ్ లో నిషేధానికి గురైనా కానీ, దురంధర్ భారతదేశం సహా ఇండియన్ డయా స్పోరాలో అద్భుత వసూళ్లను సాధించింది. ధురంధర్ ఇతర భారతీయ భాషలలో డబ్బింగ్ వెర్షన్ విడుదల కాకపోయినా ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఒక సంచలనం . ఇక జవాన్, పఠాన్ రికార్డులను అధిగమిస్తే `దంగల్` తర్వాత అతి పెద్ద బాలీవుడ్ హిట్ సినిమాగా దురంధర్ రికార్డులకెక్కుతుంది.
ప్రస్తుతం దురంధర్ దూకుడు చూస్తుంటే, ఈ సినిమా సునాయాసంగా 1200కోట్ల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు. మునుముందు సంక్రాంతికి భారీ సినిమాలు విడుదలకు వస్తున్నాయి గనుక, దురంధర్ దూకుడుకి బ్రేక్ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రణ్ వీర్ సింగ్ సినిమా ఇంత పెద్ద విజయం సాధించినా కానీ, బాలీవుడ్ ప్రముఖ హీరోల నుంచి కానీ, ప్రముఖ దర్శకుల నుంచి కానీ ఇప్పటివరకూ ఎలాంటి కాంప్లిమెంట్ లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
