Begin typing your search above and press return to search.

ఆ సినిమాకి వివాదం కలిసొచ్చిందా..!

బాలీవుడ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో వచ్చిన మరో మూవీ దురంధర్.

By:  Ramesh Palla   |   8 Dec 2025 12:11 PM IST
ఆ సినిమాకి వివాదం కలిసొచ్చిందా..!
X

బాలీవుడ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో వచ్చిన మరో మూవీ దురంధర్. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై బాక్సాఫీస్ వర్గాల వారు మాత్రమే కాకుండా ప్రేక్షకులు సైతం అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది అంటూ రివ్యూలు వస్తున్నాయి. హీరో రణ్వీర్ సింగ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా రూపొందింది. కానీ ఆ స్థాయిలో సినిమా లేదు అనేది కొందరి మాట. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు వసూళ్ల పరంగా సాలిడ్ నెంబర్స్ నమోదు అవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి ఒక వర్గం వారు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు, అలాగే మరోవైపు సినిమా చుట్టూ వివాదాలు నడిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే పుకార్లు వినిపిస్తున్నాయి. వీటన్నిటి వల్ల సినిమాకు మంచి జరుగుతుందని, అందుకే సినిమాకు కలెక్షన్స్ పరంగా సంతృప్తికరమైన నెంబర్స్ నమోదు అవుతున్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్...

ఇటీవల సినిమాకు సంబంధించి ప్రముఖ బాలీవుడ్ మీడియా పర్సన్ అనుపమ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె సినిమా విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమాలోని లోటుపాట్లను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. సినిమా మొత్తం కూడా తీవ్రమైన యాక్షన్స్ సన్నివేశాలు ఉన్నాయని, అంతేకాకుండా కొన్ని అనుచిత సన్నివేశాలు కూడా ఉన్నాయి అంటూ రివ్యూ ఇచ్చింది. ఆ రివ్యూ పై సీనియర్ నటుడు పరేష్ రావాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా ద్వారా అనుపమ చోప్రాను ఉద్దేశిస్తూ మిస్ ఇర్రిలవెంట్ గా ఉండడం వల్ల మీరు అలసిపోయారా అని అర్థం వచ్చేట్లు పోస్ట్ చేశాడు. అతడి పోస్ట్ ను చాలా మంది విమర్శిస్తుంటే మరికొందరు పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా గురించి ఎవరి అభిప్రాయం వారు చెప్పవచ్చు.. అది సోషల్ మీడియా అయినా మరే ప్లాట్ ఫామ్ అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా రివ్యూ ఇవ్వచ్చు. రివ్యూ ఇచ్చిన వారిని ఇలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొందరు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.

దురంధర్ సినిమా రివ్యూ

గత రెండు రోజులుగా ఈ విషయమై సోషల్ మీడియాలో జనాలు రెండుగా విడిపోయి మరి కామెంట్స్ తో తెగ చర్చించేస్తున్నారు. కొందరు అనుపమ చోప్రా కి మద్దతుగా నిలిస్తే మరి కొందరు మాత్రం సినిమా విషయంలో పాజిటివ్గా కామెంట్స్ చేస్తూ సీనియర్ నటుడు పరేష్ రావెల్ కి మద్దతుగా నిలుస్తున్నారు. జనాలు రెండుగా విడిపోయి సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకోవడంతో ఎక్కువ మందికి సినిమా రీచ్ అవుతుందని, తద్వారా సినిమాలో ఏముంది అసలు అనే ఆసక్తి కొందరిలో కలుగుతుందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. తద్వారా సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయని.. వీక్ డేస్ లో కూడా సినిమా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు వివాదం హెల్ప్ అవుతుంది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. సినిమా గురించి ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. ఆ మధ్య ఒక వ్యక్తికి సంబంధించిన బయోపిక్ అంటూ ప్రచారం జరగడం వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఆ విషయం కూడా ప్రస్తావనకు రావడంతో ఆ వ్యక్తి గురించి ఇందులో ఎంత వరకు చూపించారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొందరు సినిమాను చూడాలని అనుకుంటున్నారు.

వివాదంతో కలిసి వచ్చిందా..

బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో వచ్చిన స్పై థ్రిల్లర్ మాదిరిగానే ఈ సినిమా ఉంది అంటూ ప్రేక్షకుల నుండి రివ్యూ వస్తుంది. భారత రా ఏజెంట్ పాత్రలో హీరో కనిపించాడు. సినిమా మూడున్నర గంటలకు పైగా నిడివి ఉండడం ను కొందరు విమర్శిస్తుంటే మరికొందరు యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే వారు మాత్రం సినిమాకు నిడివి ప్లస్ అంటున్నారు. ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు మాత్రం యాక్షన్ సీన్స్ డోస్ ఎక్కువ అయింది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఇది బయోపిక్ అనే ప్రచారం జరిగింది. కానీ సినిమా విడుదల తర్వాత అలాంటిది ఏం లేదు అని క్లారిటీ వచ్చేసింది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్న సమయంలో చెప్పినట్లుగా సినిమాలో అన్ని వర్గాల వారు చూసేందుకు గాను అన్ని రకాల ఎలిమెంట్స్ లేవు అనేది కొందరి అభిప్రాయం. సినిమాలకు ఈ మధ్య కాలంలో కంటెంట్ సరిగా లేకున్నా వివాదాలతో పబ్లిసిటీతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఈ సినిమాకు కావాలని చేస్తున్నారా... లేదా అనుకోకుండా జరుగుతుందో కానీ వివాదం వల్ల కాస్త మంచి జరుగుతుంది అని అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.